నిజామాబాద్

పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోమకొండ, జనవరి 21: దేశంలో నిరుపేదల సంక్షేమానికి తమ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం మండలంలోని చింతామన్‌పల్లి గ్రామంలో నూతనంగ ఏర్పాటు చేసిన జాతీపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన హామీలను నేటీకీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందించడంలో నిర్లక్ష్యం మూలంగా సమయానికి పెన్షన్ డబ్బులు చేతికందక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశానికి వెనె్నముక అయిన రైతులకు రుణమాఫీపై సరైన న్యాయం చేయలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సోనియా గాంథీ త్యాగ ఫలితమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల పెన్షన్ అందిస్తామని, రెండు లక్షల వరకు రుణ మాఫీ చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీనికి ముందు రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకీ తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా ఉండి ముందుకుసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మెన్ ఎడ్ల రాజిరెడ్డి, కైలాస్ శ్రీనివాస్, వేణుగోపాల్, ఇంద్రకరణ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు తీగల తిర్మల్ గౌడ్, మండల అధ్యక్షుడు తిరుపతి గౌడ్, పట్టణ అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లయ్య చెరువును పరిశీలించిన మంత్రి
బాన్సువాడ రూరల్, జనవరి 21: బాన్సువాడ పట్టణంలోని వారపు సంత ఏర్పాటుతో 40 ఏళ్ల దీర్ఘకాలిక సమస్య తీరిపోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఎల్లయ్య చెరువును సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. అంగడి ఏర్పాటులో బాగంగా కూరగాయలకు,మాంసహార విక్రయాలకు వేరేవిధంగా షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చే వారికి ఏలాంటి ఇబ్బందులు ఎదురవకుండా కావాల్సిన వౌళిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలుతీసుకోవాలన్నారు. వారపుసంతలో చిన్నసాటి వ్యాపారులకు కావాల్సిన సదుపాయాలను కల్పించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి చెప్పారు. అరగంట పాటు అంగడి స్థలాన్ని పరిశీలించిన పోచారం అక్కడున్న వారికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్న అంశంపై పలు సూచనలు అందచేశారు. మంత్రితోపాటు అంజిరెడ్డి, జంగం గంగాధర్, ఎజాజ్ తదితరులు ఉన్నారు.