నిజామాబాద్

మెరుగైన వైద్యం కోసమే 102సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, జనవరి 23: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం 102 సేవలను ప్రారంభించడం జరిగిందని బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన బాల్కొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 102వాహనాలకు శాస్రోక్తంగా పూజలు నిర్వహించి, జెండాఊపి ఎమ్మెల్యే ప్రాభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అమ్మఒడి 102 సేవలను ప్రారంభించడం జరిగిందన్నారు. వీటి ద్వారా పేద కుటుంబాలకు చెందిన గర్భిణీ స్ర్తిలను ఆసుపత్రికి తీసుకరావడం, ప్రసూతి అనంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేరవేయడం, గర్భిణిలకు, పిల్లలకు సమయానుసారంగా టీకాలు, వ్యాక్సిన్ అందించేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడ్తాయన్నారు. నియోజకవర్గానికి 2వాహనాల చొప్పున ఈ వాహనాలను కేటాయించడం జరిగిందని, వీటిని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలింతలకు కేసీఆర్ కిట్టుతో పాటు మగబిడ్డకు జన్మనిస్తే 12వేలు, ఆడబిడ్డకు జన్మనిస్తే 13వేల రూపాయలు పౌష్టికాహారం కోసం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రమేష్, డాక్టర్ చంద్రమోహన్, బాల్కొండ సర్పంచ్ తౌటు గంగాధర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దాసరి వెంకటేష్, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ పుప్పాల విద్యాసాగర్, టౌన్ ప్రెసిడెంట్ లింగాగౌడ్ పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధిత కుటుంబానికి మంజూరైన చెక్కులను మంగళవారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండల కేంద్రానికి చెందిన ములుగు లింగన్నకు 44వేలు, అల్లం నరేష్‌కు 36వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేయించిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞలు తెలిపారు.

రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం
*బ్యాంకు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే షకీల్
బోధన్ రూరల్, జనవరి 23: రైతు సంక్షేమమే ధ్యేయంగా అహరహం కృషి చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలుస్తోందని బోధన్ శాసన సభ్యుడు షకీల్ అహ్మద్ పేర్కొన్నారు. బోధన్ మండల కేంద్రంతో పాటు సాలూరాలో ఎన్‌డీసీసీబీ బ్యాంకును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తీవ్ర వివక్షతకు గురైన ఈ ప్రాంత రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు లక్షలోపు రుణమాఫీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలను అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందన్న ప్రతిపక్షాల నోటి నుండి మాట రాకుండా పగటిపూటనే 9గంటల విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని, భూగర్భ జలాల పెంపుదలకు మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఆ పథకంతో నేడు గ్రామాల్లోని చెరువులన్నీ నీటితో కళకళలాడుతూ, రైతుల పంటలు పండించుకునేందుకు వీలుగా నిండుకుండలా తొణికిసలాడుతున్నాయని అన్నారు. మరోవైపు కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక సాగునీటి పథకాలను చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయితే బోధన్ నియోజకవర్గం పరిధిలో లక్షలాది ఎకరాలకు సాగునీటి కష్టాలు పూర్తిస్థాయిలో తీరుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ నుండి రైతులు పంటల సాగు చేసుకునేందు గాను పెట్టుబడుల కోసం ఎకరానికి 4వేల రూపాయల చొప్పున అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.