నిజామాబాద్

స్థానిక సంస్థలు నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 23: గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష పద్ధతుల్లోనే ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ డిమాండ్ చేశారు. టీ.పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సచివాలయ కార్యదర్శులకు మెమోరాండంలు అందజేశారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ రూరల్ మండలంలోని ముల్లంగి, తాడెం గ్రామ పంచాయతీల కార్యదర్శులకు డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నేతృత్వంలో వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం పరోక్ష పద్ధతిలో నిర్వహించాలని భావిస్తోందని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. దీనివల్ల స్థానిక సంస్థలు మరింతగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల తెరాస ప్రభుత్వ పాలనలో ఇప్పటికే స్థానిక సంస్థలను అన్ని విధాలుగా నిర్వీర్యం చేశారని, ప్రజాప్రతినిధులను నిధులు, విధులు లేకుండా చేశారని ఆయన దుయ్యబట్టారు. మన ఊరు - మన ప్రణాళిక, గ్రామజ్యోతి వంటి కార్యక్రమాలను ఎంతో ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ, వీటి కింద పల్లెలకు నయా పైసా కేటాయించలేదని, కేసీఆర్ పాలనలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మెన్లు ఇలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సింది పోగా, వలసలను ప్రోత్సహించేలా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తలపోయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదని అభిప్రాయపడ్డారు. తెరాస ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆరు నెలలు ముందుగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండడంతో ప్రస్తుత సిట్టింగ్ సర్పంచ్‌లను అగౌరవపర్చినట్లవుతుందని అన్నారు. ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ఆగస్టు 1వ తేదీ నాటికి పూర్తవుతున్నందున జూలైలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక పరిరక్షణ కోసం తమ పార్టీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని, ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ క్షేత్ర స్థాయిలో సచివాలయ కార్యదర్శులకు మెమోరాండంలు అందించడం జరిగిందన్నారు. 27వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి ఆర్డీఓలకు వినతిపత్రాలు సమర్పిస్తామని, 30వ తేదీన జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు మెమోరాండంలు అందజేస్తామని అన్నారు.
ఉనికి కోసమే రాద్ధాంతం
*కాంగ్రెస్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్, జనవరి 23: ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో 33 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతి భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వస్తున్న పేరును కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని అన్నారు. ఆలూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు సదస్సులో రైతులెవరూ పాల్గొనలేదని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోనే సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆలూర్ డిక్లరేషన్‌తో రైతులకు ఒరిగేదేమి లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కనిపించని గిట్టుబాటు ధరలు అధికారంలో లేనప్పుడు ఎలా తెలుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అంతకుముందు మగ్గిడిలో పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే తెల్లవారుజామున 5 గంటల నుంచి వీధుల వెంట తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోతు నర్సయ్య, జడ్పీటీసీ సాందన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, మండల ప్రత్యేక అధికారి రామారావు నాయక్, సర్పంచ్‌లు కళాశ్రీ, చింత సరస్వతి, బొడ్డు గంగామణి, మెట్టు నరేష్, రాస జగదీష్, ఉప సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, చింత దేవిదాస్, బొడ్డు నారాయణ, సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.