వరంగల్
ఎండలతో జాగ్రత్త!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వరంగల్, ఏప్రిల్ 19: ట్రాఫిక్ సిబ్బంది తమ ఆరోగ్య పరిరక్షణ కోసం కనీస జాగ్రత్తలు పాటిస్తూ వేసవి కాలంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. రోడ్లపై ఎండవేడిమిలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణలో భాగంగా కమిషనరేట్ ట్రాఫిక్ సిబ్బందికి ప్రతిరోజు రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం కాజీపేట ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో కమిషనర్ సుధీర్‌బాబు ప్రారంభించారు. ప్రస్తుత వేసవి కాలంలో జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా ట్రైసిటీ పరిధిలో రోడ్లపై నిరంతరం విధులు నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం పరిరక్షించడంతో పాటు చురుగ్గా విధులు నిర్వర్తించేందుకై ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ప్రతిరోజు ఉదయం రోల్‌కాల్ సమయంలో ఒక గ్లాస్ రాగిజావను పంపిణీ చేయాల్సిందిగా పోలీసు కమిషనర్ ఆదేశించారు. కమిషనరేట్ విభాగంలో ట్రాఫిక్ చాలా కీలకమైన విభాగమని, ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వర్తించే తీరుపై కమిషనరేట్‌కు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాయన్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యాన్ని పరిరక్షించడం పోలీసు అధికారుల బాధ్యత అని, ఇందుకోసమే ట్రాఫిక్ సిబ్బందికి తెలంగాణ సాంప్రదాయక ఆహారం రాగిజావ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.