నిజామాబాద్

ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 16: నగరంలో జరుగుతున్న యూజీడీ పనులతో దుమ్ము, దూళి రోడ్లపై ఎగిసిపడుతుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మినారాయణ ఆరోపించారు. ప్రజా ఆరోగ్యం విషయంలో పాలకులు, అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ బీజేపీ 2వ జోన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఫూలాంగ్ చౌరస్తాలో నాయకులు, కార్యరక్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ నగరంలో వందలాది కోట్ల రూపాయలతో యూజీడీ, మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు, ప్రయాణీకులు దుమ్ము, దూళితో ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. యూజీడీ, మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన గుంతలను పూర్తిస్థాయిలో పూడ్చివేయకపోవడంతో గుంతలమయంగా మారి వాహనదారులు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడగా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినా, ఆ హామీని నిలబెట్టుకోవడంలో తాత్సారం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పెద్దపీఠ వేస్తున్నామని పేర్కొంటున్నారు, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ఏఒక్క హామీని కూడా ఎందుకు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారని నిలదీశారు. రైతులకు రుణమాఫీ అంటూ ప్రకటించిన సీఎం కేసీఆర్, దశల వారిగా అందించిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. ప్రభుత్వం లక్షలోపు రుణాలను మాఫీ చేస్తానని ఇచ్చిన హామీతో ఆనందంతో ఉన్న రైతులు, వడ్డీపై వడ్డీ చెల్లించి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నారు. నగరంలో నెలకొన్న దుమ్ము, దూళి సమస్యలతో దేశానికి అన్నంపెట్టే రైతుల సమస్యల పరిష్కారంలో తెరాస పూర్తిగా విఫలమైనందునే, బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీలను అమలు చేసే విధంగా ఉద్యమిస్తోందన్నారు. ప్రజలను ఇబ్బందుల కు గురిచేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని, టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఆందోళనలో బీజేపీ నాయకులు సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నగర అధ్యక్షుడు యెండల సుధాకర్, మల్లేష్‌యాదవ్, రోషన్‌బోరా, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుణ, పుష్పలతతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.