నిజామాబాద్

ఫసల్ బీమా యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 20: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రభుత్వం నుండి మంజూరైన నిధులను సంబంధిత రైతుల ఖాతాల్లో సత్వరమే జమ అయ్యేలా బ్యాంకర్లు చొరవ చూపాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సూచించారు. స్థానిక ప్రగతిభవన్‌లో మంగళవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫసల్ బీమా యోజన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల బాధిత రైతులకు ఆర్థిక సాంత్వన చేకూరలేకపోతోందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా సత్వరమే రైతుల ఖాతాల్లో బీమా పథకం డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న దరిమిలా, బ్యాంకర్లు కూడా రైతాంగానికి తమవంతు తోడ్పాటును అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పంటల సాగు కోసం అర్హులైన రైతులందరికీ సకాలంలో పంట రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని హితవు పలికారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్, రబీ సీజన్‌లలో నూటికి నూరు శాతం రుణ లక్ష్యాన్ని సాధించాలన్నారు. అన్ని బ్యాంకులు ఆయా శాఖల వారీగా రుణాల పంపిణీ ప్రక్రియను క్రమం తప్పకుండా సమీక్షించుకుంటూ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. రైతాంగానికి అందించే రుణాలను తిరిగి రాబట్టుకునే విషయమై బ్యాంకర్లు ఎలాంటి సంశయాలకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇప్పటికే వివిధ రకాల పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రక్రియను పూర్తి చేసి రుణ అర్హతను పెంచడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వీలుగా చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్ర రుణాలను అందజేస్తోందని, ఈ కార్యక్రమం కింద జిల్లాలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలను నెలకొల్పేందుకు బ్యాంకర్లు తమవంతు తోడ్పాటును అందించాలన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా లబ్ధిదారులుగా ఎంపికైన వారికి రుణాలు మంజూరు చేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇది సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నుండి సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేసినప్పటికీ, వాటికి రుణ మొత్తాలను జతపరుస్తూ లబ్ధిదారులకు అందించడంలో బ్యాంకర్లు చొరవ చూపకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ఈ.డీ మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నాటికి రుణాల మంజూరుకు సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్‌ను మూసివేయనున్నారని, ఈ లోపే లబ్ధిదారులకు రుణాలు అందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో బ్యాంకర్లను కోరారు. అదేవిధంగా ఆసరా పెన్షన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు కూడా నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో రుణాలు అందించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ అధికారి హరిశంకర్, నాబార్డు డీడీఎం రమేష్‌కుమార్, ఆంధ్రా బ్యాంక్ డీజీఎం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
దేగాం పీహెచ్‌సీ అమ్మఒడి కార్యక్రమం
ఆర్మూర్, ఫిబ్రవరి 20: ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా దేగాం వైద్యాధికారిణి స్వాతి వినూత్న 98 మంది గర్భిణీ స్ర్తిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 64 మందికి రక్త పరీక్షలు చేశారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఇఓ నాగరాజు, పిహెచ్‌ఎన్ స్వరూప, హెల్త్ సూపర్‌వైజర్లు శంకర్, నారాయణ, విక్టోరియా, పద్మలత, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.