నిజామాబాద్

మెడికల్ కళాశాలలో ఎంసీఐ బృందం ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 20: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల గత నాలుగు సంవత్సరాలుగా అన్ని విభాగాలకు సంబంధించిన సీట్లను సాధించుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో 5వ సంవత్సరం అనుమతి కోసం మంగళవారం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు ఎంసీఐ బృందంగా ఏర్పడి జిల్లా మెడికల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఎంసీఐ నిబంధనల ప్రకారం అత్యావసర విభాగం, ఆపరేషన్ థియేటర్, పాథాలోజికల్, బ్లడ్‌బ్యాంకు, చిల్డ్రెన్ వార్డు, అనాటమి, ఫిజియోలాజిస్టు, బయోకెమిస్ట్రీ, మైక్రో బయోలాజీ, ఫోరెన్సిక్స్ వంటి విభాగాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేయడంతో పాటు బృందం సభ్యులు రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వైద్య సిబ్బంది అభ్యసించిన ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో పాటు మెడికో విద్యార్థులకు కావాల్సిన క్రీడా, కాన్ఫరెన్స్ సెంటర్, లైబ్రరీ లాంటి వసతులను పరిశీలించారు. మెడికల్ కళాశాలతో పాటు జిల్లా జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న నవీపేటలోని పీహెచ్‌సీ సెంటర్‌ను సందర్శించి కావాల్సిన వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ, మెడికల్ కళాశాల ప్రారంభం నుండి ఫైనల్ అనుమతి వరకు ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా ఫైనల్ ఈయర్ వరకు సంబందించిన నివేదికను తయారు చేయడం జరుగుతుందన్నారు. ఎంసీఐ బృందం ఆకస్మిక తనిఖీలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి నివేదికను తయారు చేయడం వల్ల బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఖచ్చితంగా 5వ సంవత్సరానికి కావాల్సిన అనుమతి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలను సందర్శించిన బృందంలో కలకత్తాకు చెందిన మెడికల్ రీసెర్స్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ అభిమన్యుబోస్, కర్నాటక మెడికల్ కళాశాల ప్రొఫెసర్ కేఆర్.మహంతి, రాజస్థాన్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రథీమంతుర్‌లు ఉన్నారు. ఎంసీఐ బృందం వెంట కళాశాలలోని అన్ని విభాగాలకు సంబంధించిన హెచ్‌ఓడీలు, డాక్టర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్‌రెడ్డి, వైద్యులు డాక్టర్ జలగం తిరుపతిరావు, బన్సీలాల్, బాల్‌రాజ్, గోపాల్‌సింగ్, ప్రేమానందం, దినేష్ తదితరులు ఉన్నారు.