నిజామాబాద్

దివ్యాంగులు సమాజంలో ఒక భాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఫిబ్రవరి 20: దివ్యాంగులు సమాజంలో ఒక భాగమేనని, అందువల్ల వారిని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని శివాజీనగర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో సర్వశిక్ష అభియాన్, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయ ఉపకారణాల నిర్ధారణ, వినికి యంత్రాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏదో ఒక లోపంతో బాధపడుతున్న దివ్యాంగులు నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. సమాజ అభివృద్ధిలో దివ్యాంగులు కూడా తమవంతు పాత్రను పోషిస్తున్నారని, అందువల్ల వారికి కావాల్సిన సౌకర్యాల కల్పనలో ప్రతి ఒక్కరు తమవంతు సహకారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ రామ్మోహన్‌రావు అభిప్రాయపడ్డారు. దివ్యాంగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే దివ్యాంగులకు వినికిడి, నడకకు సంబంధించిన పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 40శాతం, ఎంపీ కోటా నుండి 60శాతం నిధులతో సమకూర్చడం జరిగిందన్నారు. దివ్యాంగులకు భవిత సెంటర్ ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తుండటంతో 374మంది పిల్లలకు చదువు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నిర్వహిస్తున్న సెంటర్స్ రిసోర్స్ పర్సన్ అలీమ్‌తో పాటు ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. గత సంవత్సరం క్యాంప్ ద్వారా గుర్తించిన 164మంది దివ్యాంగులకు వివిధ రకాల అవసరం ఉన్న ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకు కిట్స్, ట్రైసైకిళ్లు, ఎంఆర్‌కిట్స్, బ్రెయిలీ కిట్స్‌ను అందజేశారు. అంతకు ముందు కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు శంకర్‌భవన్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి మంగళవారం రోజున పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనిన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ, పాఠశాలలో విద్యా బోధన ఎలా జరుగుతుందని, మరుగుదొడ్లు, ఇతరాత్ర వౌళిక సదుపాయాలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్, ఐఆర్‌పీ ప్రకాష్, స్థానిక కార్పొరేటర్ సుధా, ఎంఇఓ రాములు, కోఆర్డినటర్ ఎ.వినోద్‌కుమార్, భవిత సెంటర్ నిర్వాహకుడు అలీమ్, నోడల్ అధికారి లింగమూర్తి, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.