నిజామాబాద్

జనవరి 1నుండి ‘డబుల్’ దరఖాస్తుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల పథకానికి జనవరి 1 నుండి 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా వెల్లడించారు. అన్ని అర్జీలను నిశితంగా పరిశీలన జరిపి అర్హులైన వారికే లబ్ధి చేకూరేలా చూస్తామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు గురించి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆయా మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూమ్ పథకంలో నిజమైన లబ్ధిదారులకే ప్రయోజనం చేకూరేలా ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా అర్హులైన వారు దరఖాస్తులు చేసుకునేలా ప్రతి గ్రామంలోనూ టాంటాం చేసి ప్రచారం నిర్వహించాలని, ప్రసార మాధ్యమాల ద్వారా ఈ పథకం మార్గదర్శకాల గురించి తెలియజేయాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన వారి నుండి గ్రామ స్థాయిలో విఆర్‌ఓలు దరఖాస్తులను స్వీకరించాలని, తహశీల్దార్, ఆర్డీఓ సాయిలలో ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించాలని అన్నారు. అర్జీదారులు అందజేసిన దరఖాస్తులను జనవరి 8 నుండి 20వ తేదీ వరకు పరిశీలన జరపాలని, 21వ తేదీన గ్రామాల వారీగా మొట్టమొదట సమర్పించిన దరఖాస్తును గుర్తించాలని ఆదేశించారు. 21 నుండి 25వ తేదీ వరకు ప్రజలు అందజేసే అభ్యంతర పత్రాలను తీసుకోవాలని అన్నారు. జనవరి 7వ తేదీ అనంతరం వచ్చిన దరఖాస్తులను, 25వ తేదీన వచ్చిన అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరాదని అధికారులను ఆదేశించారు. జనవరి 29 నుండి 31వ తేదీలోగా దరఖాస్తులను ఫైనలైజ్ చేసి 31వ తేదీన లక్కీ డ్రా వేయాలని, డ్రాలో పేర్లు వచ్చిన వారికి మొదటగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని కలెక్టర్ సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించి పూర్తి వివరాలను నివేదిక రూపంలో జిల్లా కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. కాగా, మీ సేవా దరఖాస్తులు ఆర్డీఓల స్థాయిలో చాలా వరకు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఎకనామికల్ సపోర్ట్ స్కీం కింద వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో పొందుపర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి ఇబ్బంది తలెత్తిన ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన బోరుబావులను అద్దె ప్రాతిపదికన తీసుకుని నీటి సరఫరాను మెరుగుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిఆర్‌ఎఫ్, నాన్ సిఆర్‌ఎఫ్ పనులను గుర్తించి వాటి వివరాలను పొందుపరిస్తే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పి.డి వెంకటేశం, డ్వామా పి.డి వెంకటేశ్వర్లు, హౌసింగ్ పి.డి చైతన్యకుమార్‌తో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.