నిజామాబాద్

అకాలవర్షంతో తడిసి ముద్దయిన పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 17: అల్పపీడన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటుచేసుకుని కురిసిన అకాల వర్షంతో పంట ఉత్పత్తులన్నీ తడిసి ముద్దయ్యాయి. రెండు రోజుల నుండి వాతావరణం పూర్తిగా చల్లబడి అడపాదడపా చిరుజల్లులు మాత్రమే కురియగా, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జిల్లావ్యాప్తంగా కురిసిన ఒక మోస్తారు వర్షానికి ఆరుబయట నిల్వ ఉంచిన పంటలు తడిసిపోయాయి. ప్రధానంగా పసుపు, ఎర్రజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదనకు లోనయ్యారు. విక్రయాల నిమిత్తం నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తరలించిన వందలాది క్వింటాళ్ల పసుపు పంటను ఆరుబయటే ఉంచగా, అకాల వర్షంతో బాధిత రైతులు నష్టపోవాల్సి వచ్చింది. జిల్లాలో సగటున 7.8మి.మీ వర్షపాతం నమోదవగా, అత్యధికంగా ఏర్గట్ల మండలంలో 19.3మి.మీ వర్షం కురిసింది. అలాగే ముప్కాల్ మండలంలో 18మీ.మీ, ఆర్మూర్‌లో 11.2, కమ్మర్‌పల్లిలో 9.8, మోర్తాడ్‌లో 15.8,,నిజామాబాద్‌లో 9.5మీ.మీ, నందిపేటలో 12.5మి.మీ, మెండోరాలో 16.5, రెంజల్‌లో 14.8, నవీపేటలో 11.0, బోధన్‌లో 9.6మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం నుండి తిరిగి వాతావరణం యథాస్థితికి చేరుకోవడం రైతులను ఒకింత ఊరటనందించింది. తడిసిన పంటలను ఆరబెట్టుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. అకాల వర్షానికి నానిన పంటలు రంగు మారి, వాటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉండడంతో మద్దతు ధర అందే అవకాశం లేదని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. కాగా, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఉదయం 10గంటల వరకు కూడా దట్టమైన పొగమంచు కమ్ముకుని కనిపించింది. దీంతో జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఉండడాన్ని గమనించిన డ్రైవర్లు తమ వాహనాలను రోడ్ల పక్కన ఎక్కడికక్కడ నిలిపివేస్తూ, పొగమంచు వీడిన అనంతరం ముందుకు సాగారు.

ఎఐసిసి సభ్యులుగా సురేష్‌రెడ్డి, లలిత
మోర్తాడ్, మార్చి 17: ఎఐసిసి సభ్యులుగా జిల్లాకు చెందిన ఇరువురు ప్రముఖులకు పదవులు దక్కాయ. మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలితను ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా అధిష్టానం వీరిని జిల్లా నుంచి ఎంపిక చేసింది. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఫ్లీనరీలో వీరిద్దరికీ ఈ పదవులు దక్కాయి. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్న సురేష్‌రెడ్డితోపాటు లలితకు ఈ పదవులు దక్కడం పట్ల జిల్లా కాంగ్రెస్ కేడర్‌లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో పార్టీ కష్టకాలంగా ఉన్న దరిమిలా అధిష్ఠానం కేడర్‌ను ఉత్తేజపరిచే చర్యల్లో భాగంగా జిల్లా నుంచి వీరిని ఎంపికచేయడం పట్ల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2009లో నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓటమి పొందిన లలిత, ఆ తర్వాత పార్టీ కార్యక్రమా ల్లో చురుగ్గా పాల్గొని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేసిన సేవలను అధిష్ఠానం గుర్తించి 2015లో ఎమ్మెల్సీగా లలితకు అవకాశం కల్పించారు. బాల్కొండ నియోజకవర్గం నుండి సురేష్ రెడ్డి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, అత్యున్నత శాసనసభా స్పీకర్ పదవి చేపట్టారు. 1989నుండి 2009వరకు బాల్కొండ నియోజకవర్గంలో వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సురేష్‌రెడ్డి, దివంగత వైఎస్సార్ ప్రభుత్వంలో శాసనసభా స్పీకర్‌గా సేవలందించారు. వివాదరహితుడిగా పేరొందిన సురేష్‌రెడ్డి గ్రామీణస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంలో క్రియాశీలక భూమిక పోషించడంతో ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఏఐసీసీ సభ్యుడిగా నియమించింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఆకుల లలితకు సైతం ఎఐసిసి సభ్యురాలిగా ఎంపిక చేయడంతో అయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులకు చేరడంతో సంబురాలు జరుపుకున్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ పదవి ఎంతో ఉపయోగపడుతుందని, సురేష్‌రెడ్డి, లలిత నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈనెల 19న సురేష్‌రెడ్డి ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.