క్రైమ్/లీగల్

ఉగాది వేడుకల్లో అపశృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి/దోమకొండ, మార్చి 18: ఉగాది పండగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహ వాతావరణంలో జరుపుకునే సందర్భంలో ఒకింత అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలోని శివరామ్ మందిరం వద్ద ఎడ్లబండ్ల ప్రదక్షిణలో ఎడ్లు బెదరడంతో ఎండ్లబండిపై బాల్‌రెడ్డి అనే వ్యక్తి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఎడ్లు బెదిరిపోయ బండిని లాగడంతో సమీపంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని 108లో హుటాహుటిన జిల్లాకేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులకు వైద్యులు చికిత్సలు నిర్వహిస్తున్నారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనతో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీక్లి మార్కెట్‌లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జెండా ఊపి ఎడ్లబండల ప్రదక్షిణ ప్రారంభించారు. సాయంత్రం ప్రారంభం అయిన ఎడ్లబండ్ల ప్రదక్షిణ రాత్రి వరకు ఇంకా కొనుసాగుతూనే ఉంది. ముందుగా వీక్లి మార్కెట్‌లోని దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల వద్ద ఐదు ప్రదక్షిణల అనంతరం గాంధీగంజ్‌లో ఒక ప్రదక్షిణ, అక్కడ నుండి కృష్ణమ్మగుడి, పెద్దమ్మగుడి వద్ద ప్రదక్షిణలు నిర్వహించారు. ఎడ్లబండ్లను అందంగా అలంకరించారు. మొత్తం 28 ఎడ్లబండ్లు ఈ ప్రదక్షణలో పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీ వారు ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండి ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మెన్ ముజిబొద్దిన్‌తోపాటు టీఆర్‌ఎస్ నాయకుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి డిఎస్పీ ప్రసన్నరాణి, సీఐలు శ్రీ్ధర్‌కుమార్, కోటేశ్వర్‌రావు, భిక్షపతిలతో పాటు ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని తెలంగాణ తిరుమల తిరుపతి వెంకటేశ్వరాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూజలుచేసి షడ్రుచులతో తయారు చేసిన పచ్చడిని స్వీకరించి, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలో నల్లపోచమ్మ ఆలయం వద్ద ఎడ్లబండ్ల ప్రదక్షణ భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ ప్రదక్షణ కార్యక్రమానికి ఎల్లారెడ్డి డీఎస్పీ చంద్రశేకర్‌గౌడ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ డివిజన్ కేంద్రాల్లో సైతం భారీస్థాయిలో ఎడ్లబండ్ల ప్రదక్షణలు నిర్వహించారు. ఎల్లారెడ్డి ముత్యాల పోచమ్మ ఆలయం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఎడ్లబండ్ల ప్రదక్షణ తిలకించేందుకు వచ్చారు. మొత్తానికి జిల్లాలో ఒక దోమకొండ మినహా అంతంట ప్రశాంతంగానే ఉగాది ఎడ్లబండ్ల ప్రదక్షణలు జరగడంతో పోలీసులు ఊపిరీ పీల్చుకున్నారు.