నిజామాబాద్

అంతా సుఖసంతోషాలతో గడపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, మార్చి 18: ప్రజలందరు సుఖసంతోషాలతో జీవనం కొనసాగిచాలని, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. ఆదివారం జడ్పీ చైర్మన్ స్వగ్రామమైన మహ్మద్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలతోకలిసి ఉగాడి పచ్చిడిని సేవించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరు సుఖసంతోషాలతో జీవనం కొనసాగించాలన్నారు. ఏ ప్రభుత్వాలు అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసి చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దఫేదార్ విజయ్‌కుమార్, మహేందర్, రమేష్, వాజిద్‌అలీ, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

శుభాలకు పునాది ఉగాది
ఇందూర్, మార్చి 18: కాలచక్రగమనంలో మనుషుల ఆశల జీవన సౌధాలకు, శుభాలకు ఉగాది పునాదిగా నిలబడుతుందని తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఆదివారం విళంబినామ ఉగాది పర్వదినం సందర్భంగా నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు. కవిత్వంలోక ప్రయోజనంకరంగా ఉండాలని, కవులు సామాజిక చైతన్యమే, సంఘ ప్రగతికి మూలమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాసర్ల నరేష్‌రావు చేసిన పంచాంగ పఠనం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటింది. అనంతరం కవి సమ్మేళనంలో జి.నర్సింహాస్వామి, ఎలగందుల లింబాద్రి, డాక్టర్ కాసర్ల, శ్రీకాంత్, నరాల సుధాకర్, కళా గోపాల్, డాక్టర్ త్రివేణి కవితలను వినిపించారు. కార్యక్రమంలో కే.నాగరాజు, జి.రాజు, శ్రీను, సందేశ్, కిరణ్ తదితరుల పాల్గొన్నారు.

ఆలయంలో గదులు ప్రారంభించిన మంత్రి
నసురుల్లాబాద్, మార్చి 18: బీర్కూర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో అదనపు గదులను ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేయడం జరుగుతోందని అన్నారు. ఈ ఆలయానికి ఎంత అభివృద్ధి అయిన చేస్తాం అని అన్నారు.