నిజామాబాద్

అంతుచిక్కని ప్రైవేటు వ్యవహారం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, మార్చి 19: పదవ తరగతి హాస్టల్ విద్యార్థుల అడ్మిషన్‌ల సంగతేమిటో గానీ ప్రైవేటు సంస్థల నడుమ నువ్వా..నేనా అన్న పోటీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పోటీ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షల పై పడుతోంది. యాజమాన్యాలు తమతమ విద్యార్థుల జిపిఏల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాకుండా గతేడాది అత్యధిక జిపిఏలు సాధించిన యాజమాన్యాలు ఈ సారి వాటి సంఖ్యను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా అందుకు పోటీగా ఇతర యాజమాన్యాలు ఎత్తుగడలు వేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. బోధన్‌లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణ, అధికారుల తనిఖీలు పరిశీలిస్తే ప్రైవేటు రాజకీయాలు నూటికి నూరుపాళ్లు నిజమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బోధన్ అర్బన్‌తో పాటు రూరల్ ఏరియాలో కలిపి మొత్తం 14 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు విద్యాసంస్థలలోని విద్యార్థులంతా బోధన్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యాసంస్థలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే పరీక్షలు రాస్తున్నారు. రూరల్ ఏరియాలోని సాలూరా గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులతో పాటు అదే గ్రామానికి చెందిన రెండు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సోమవారం ఈ పరీక్షా కేంద్రంలో జిల్లా విద్యాశాఖాదికారి రాజేశ్‌తో పాటు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌లు ఎక్కువ సేపు తిష్టవేశారు. అక్కడి నుండి బోధన్‌లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గల ప్రభుత్వ పాఠశాల కేంద్రం, విజయమేరి పరీక్షా కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. ఇద్దరు అధికారులు ఒకేరోజు రూరల్ ఏరియా పరీక్షా కేంద్రంలో ఎక్కువ సేపు గడపడం, బోధన్ ఏరియాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రైవేటు కేంద్రాలలో తనిఖీలు చేపట్టక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కేంద్రాలలో ఎక్కువగా ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు పరీక్షలు రాస్తుండటం వల్లనే అధికారులు తనిఖీలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు అర్బన్ ఏరియా పై అధికారులు దృష్టి సారించకుండా వ్యూహాత్మక రాజకీయానికి శ్రీకారం చుట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారుల దృష్టి రూరల్ ఏరియాపై ఉంటే అర్బన్ ఏరియాలో మాస్ కాపీయింగ్ జరిపించుకోవచ్చనే ఉద్ధేశంతోనే కొందరు యజమానులు పలుకుబడిని ఉపయోగించి అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారా..లేక అధికారులకు పక్కా సమాచారంతోనే రూరల్ పై దృష్టి సారిస్తున్నారా అనేది అంతుచిక్కడం లేదు. స్థానికంగా ప్రైవేటు సంస్థల నడుమ నెలకొన్న పోటీని బట్టి ఖచ్చితంగా యాజమాన్యాలు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెట్టాయని తెలుస్తోంది. రూరల్ ఏరియాలో కేవలం ఒకే పరీక్షా కేంద్రం ఉండటం, ఇందులో కేవలం మూడు పాఠశాలలకు చెందిన విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాస్తున్నా అధికారులు ఈ పరీక్షా కేంద్రం పైనే ఎక్కువగా దృష్టి సారించడం గమనార్హం. స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేటు సంస్థల యజమానులలో కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి ఎక్కువ జిపిఎలు తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్‌లో యజమానులందరూ సభ్యులుగా ఉన్నప్పటికీ ఒకరిద్దరు యజమానులు అడ్మిషన్‌ల విషయంలో అసోసియేషన్ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించడంతో అసోసియేషన్ పెద్దలు వారి తీరుపై మొదటి నుండీ ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు అధికారుల తనిఖీలు రూరల్ ఏరియాలకు పరిమితం కావడంతో యజమానుల నడుమ ఆధిపత్య పోరు నెలకొందని స్పష్టమవుతోంది. అంతర్గతంగా ఉన్న ఈ వ్యవహారం బయట పడకుండా ఉండేందుకు వారు అనేక జాగ్రత్తలు తీసుకున్నా ప్రస్తుత పరీక్షలలో గందరగోళ వాతావరణం చోటు చేసుకోవడంతో అవన్నీ నేడు బయటకు వస్తున్నాయి. యాజమాన్యాల ఆధిపత్యాలు, అడ్మిషన్‌ల పోటీ సంగతెలా ఉన్నప్పటికీ అధికారుల తనిఖీలు సైతం వివాదాస్పదంగా మారుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు అర్బన్ ఏరియాలోని ప్రైవేటు కేంద్రాలపై మరింత దృష్టి సారించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.

లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో సాగాలి
* అధికారులకు కలెక్టర్ రామ్మోహన్‌రావు హితవు
ఇందూర్, మార్చి 19: రాష్ట్ర ప్రభు త్వం ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాల సాధన కోసం ఆర్థిక సంవత్సరం చివరి మాసం వరకు చూడకుండా, ప్రారంభం నుండి ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సూచించారు. సోమవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆయా శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను ఆర్థిక సంవత్సరం చివరి వరకు పూర్తిచేద్దామన్న ధోరణిని విడనాడి, తమకు కేటాయించిన లక్ష్యాల గ్రౌండింగ్‌కు ప్రారంభం నుండి ప్రణాళిక బద్ధంగా ముందుకుసాగాలని హితవు పలికారు. జిల్లాలో అధికారు లు తమతమ విధులను నిర్వర్తిస్తూనే సమస్యలను పరిష్కరిస్తున్నారని, చిన్నచిన్న విషయాల పట్ల సైతం అజాగ్రత్త వహించకుండా జిల్లాను ఉన్నత పథంలోకి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్న అధికారులందరిని అభినందించారు. మార్చిలో ఆయా శాఖలకు బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. అదేవిధం గా ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ‘తీయనైన తెలుగు - తెలంగాణ వెలుగు’ పుస్తకం పంపిణీలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో ముందస్తుగా పంపిణీ చేసినందుకు కలెక్టర్ ఇందుకోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ప్రగతి భవన్ ఎదుట ఏర్పాట చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్, ప్రజావాణికి వచ్చిన బాధితులకు చల్లటి మంచినీటిని అందజేశారు. కార్యక్రమంలో జేసీ రవీందర్‌రెడ్డి, ఆర్డీఓ వినోద్‌కుమార్, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లుతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.