నిజామాబాద్

కుక్కల దాడిలో 13 గొర్రెలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మార్చి 19: మండలంలోని మంథని గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కుక్కలు దాడి చేసిన సంఘటనలో 13 గొర్రెలు మరణించాయి. గ్రామానికి చెందిన కుర్మ బీరన్న, సురేష్‌లకు చెందిన గొర్రెల మందలోకి నాలుగు కుక్కలు చొరబడి 13 గొర్రెలను చంపేయడంతో పాటు 4 గొర్రెలను తీవ్రంగా గాయపర్చాయి. ఇప్పటివరకు శివ్వన్న, ముత్తెన్న, లింబాద్రి తదితరులకు చెందిన సుమారు 50 గొర్రెలు కుక్కల దాడిలో మరణించాయని గ్రామస్థులు చెప్పారు. ఒక్క గొర్రెకు కూడా ఇన్సూరెన్స్ రాలేదని అన్నారు. తమకు ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని బాధితులు కోరారు. గొర్రెల పెంపకం కోసం షెడ్లను నిర్మించి ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

మానసిక వ్యధతో తండ్రీ కూతుళ్ల మృతి
* మృతదేహాలను పరిశీలించిన ఎల్లారెడ్డి డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్
నాగిరెడ్డిపేట్, మార్చి 19: మండలంలోని తాండూర్ జీపీపరిధిలోగల అక్కంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల లోకయ్య(32), అతని కూతురు కీర్తన (10) మానసిక వ్యధతో గ్రామశివారులోని, అక్కం కుంటలోపడి మృతి చెందినట్లు,సోమవారం ఎల్లారెడ్డి డీఎస్పీ ఈ.చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. డీఎస్పీ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు ఎరుకల లోకయ్య, మొదటి భార్య లక్ష్మికి ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉందన్నారు. ఇటీవల అతని భార్య చెల్లెఅయిన గంగమణితోరెండవ వివాహం చేసుకున్నాడని తెలిపారు. అతని మొదటి భార్య కూతుర కీర్తన అంగవైకల్యం కలదని, రెండో వివాహం చేసుకున్న గంగమణి కూడా, వికలాంగురాలు కావడంతో, మానసిక క్షోభకు గురైనట్లు తెలిపారు. వారం రోజుల నుంచి మృతుడు మానసికంగా బాదపడ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలోని ఎడ్ల బండ్ల ఊరేగింపుకు వెళ్తున్నామని, ఇంట్లో చెప్పి అతని కూతురు కీర్తనతోకలిసి గోపాల్‌పేట్‌కు బయలుదేరాడు. రాత్రి పూట ఇంటికి తిరిగి రాకపోవడంతో, సోమవారం ఉదయం వెతకగా గ్రామశివారులోని అక్కం కుంటలోవారి మృతదేహాలు కనిపించినట్లు వివరించారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డిప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ వివరించారు. ఆయన వెంట నాగిరెడ్డిపేట్ ఎస్‌ఐ శేఖర్ తదితరులు ఉన్నారు.