నిజామాబాద్

ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, మార్చి 19: విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా అర్థం చేసుకుని చదివినప్పుడే విజయం సాధిస్తారని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. సోమవారం డిచ్‌పల్లి మండలంలోని మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన జెఇఇ/ఎన్‌ఇఇడి/ఎంసెట్ సమ్మర్ ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచి చదివించే సిస్టమ్ ఉంటుందని, కానీ, ఉచిత సమ్మర్ కోచింగ్‌కు వచ్చిన విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా మనస్సు పెట్టి చదువుకోవాలని సూచించారు. రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు కూడా ఉన్నత చదువులు అభ్యసించాలనే సదుద్దేశ్యంతో మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో 50మంది విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత శిక్షణ కల్పిస్తోంద్నారు. ఇందుకు ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలో చదివి, ఇంటర్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ 50మంది విద్యార్థులకు వచ్చే ఏప్రిల్ 19వ తేదీ వరకు నిష్ణాతులైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని, భోజనం, బస సౌకర్యం కోసం కేర్ టేకర్‌తో పాటు మహిళా ఉపాధ్యాయులను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ తమ బంగారు జీవితానికి బాటలు వేసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

సిద్ధులగుట్టను సందర్శించిన జర్మనీ దేశస్థులు
ఆర్మూర్, మార్చి 19: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టను సోమవారం జర్మనీ దేశానికి చెందిన దంపతులు సందర్శించారు. గుట్టపై శివాలయం, రామాలయం, దుర్గామాత ఆలయంలో జర్మనీ దేశ దంపతులు హన్స్, ఉదులాలు పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పల్లకి సేవలో వారు పాల్గొన్నారు. పల్లకి సేవ మెట్లపైన గల పాదాల వద్దకు చేరుకొని అక్కడి నుంచి తిరిగి రామాలయం వరకు నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో సాగింది. భారతదేశానికి రెండువారాల పర్యటనకు వచ్చిన జర్మనీ దేశదంపతులు సిద్ధులగుట్టపై విచ్చేసి ఉత్సాహంగా గడిపారు. సిద్ధులగుట్ట చాలా బాగుందన్నారు. అలాగే గుట్టపై ఆంజనేయ స్వామి మాలధారణ స్వాములు భిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్‌రెడ్డి, బి.సుమన్, పీసీ గంగారెడ్డి, బి.కిషన్, బోండ్ల ఆనంద్, గెంట్యాల గణేష్, మధు, నరేందర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

పడగల్‌లో శ్రీరామనవమి ఉత్సవాలు
వేల్పూర్, మార్చి 19: వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రామనవమి ఉగాది ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయని వీడీసీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజు గ్రామంలోని ఒక్కో వాడలో డప్పు వాయిద్యాలతో, మంగళ హారతులతో మంత్రోచ్ఛరణల మధ్య ఉత్సవాలు నిర్వహిస్తారు. 26వ తేదీన కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం, రథోత్సవం ఉంటుందని పురోహితుడు అవధాని రాజేష్ శర్మ తెలిపారు.