నిజామాబాద్

చిక్కిపోయన గోదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 21: లక్షలాది ఎకరాలకు సాగు జలాలు, వందలాది గ్రామాలకు తాగునీటిని అందించే గోదావరి నది చిక్కిశల్యమవడంతో ప్రస్తుత వేసవి సీజన్‌లో అటు సాగు రంగానికి, ఇటు తాగునీటి పరంగా కూడా ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. గలగలాపారే గోదావరి నదిలో ఎటు చూసినా ఇసుక తినె్నలు, బండరాళ్లే దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనే కొద్దోగొప్పో నీటి జాడలు కనిపిస్తుండగా, అవి కూడా పాయలుగా చీలిపోయి అతికష్టం మీద ముందుకు ప్రవహిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ నీటి జాడలు కూడా అంతరించిపోతే తెలంగాణ జీవనది గోదావరి పూర్తిగా ఎడారిని తలపించనుంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడడంతో వేసవి ఆరంభానికి ముందే గోదావరిలో నీటి ప్రవాహం సన్నగిల్లిపోయింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ బాబ్లీ ద్వారా ఇటీవల 0.40టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయడంతో వారం రోజుల పాటు స్వల్ప స్థాయిలోనైనా నీటి జాడలు కనిపించగా, ప్రస్తుతం అవి కూడా కనుమరుగయ్యాయి. మరోవైపు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల అవసరాలను తీరుస్తున్న మంజీరా నదిలోనూ సరిపడా నీటి నిల్వలు లేక బోసిపోయి కనిపిస్తోంది. భూగర్భ జలాలు మునుపెన్నడూ లేని రీతిలో జిల్లాలో 18మీటర్ల లోతుకు పడిపోయాయి. కనీసంగోదావరి, మంజీరా జలాలైనా ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని ఆశించగా, ఎగువన గల మహారాష్టల్రోని బాబ్లీ ప్రాజెక్టు నుండి మొదలుకుని ఎస్సారెస్పీ వరకు అటు గోదావరిలోనూ, ఇటు మంజీరాలోనూ నీటి ప్రవాహం పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో తాగు, సాగునీటి అవసరాల కోసం వీటిని ఆధారంగా చేసుకుని నిర్మించిన ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకాలన్నీ నిష్ప్రయోజనంగా మారే ప్రమాదం వెంటాడుతోంది. అసలే వేసవి ఎండలు అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో ఈ దుర్భిక్ష పరిస్థితి నుండి గట్టెక్కేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ప్రత్యామ్నాయాలను చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గోదావరి ఒడ్డునే నిర్మించిన యంచ ఫ్లోరైడ్ స్కీం ద్వారా వంద పైచిలుకు గ్రామాలకు శుద్ధి జలాలు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం గోదావరిలో మోటార్ల సహాయంతో అతికష్టం మీద 40వరకు పల్లెలకే అరకొర స్థాయిలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గుత్ప, అలీసాగర్ లిఫ్టులకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌ను వినియోగిస్తూ ఇప్పటికైతే ఎలాగోలా సాగు నీటిని అందిస్తున్నప్పటికీ, మరో పక్షం రోజుల్లో నీటి నిల్వలు కుచించుకుపోయి ఈ పథకాలు మూతబడే అవకాశం ఉందని భావిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు దైన్య స్థితికి చేరుకోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. 1091.00 అడుగులు, 90టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 17టీఎంసీల వరకే నీటి నిల్వలు మిగిలాయి. ఇందులో 5టీఎంసీలను డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు. మిగతా అరకొర నీటి నిల్వల నుండే మిషన్ భగీరథ కోసం అట్టిపెడుతూ, ఆయకట్టు పంటలకు ప్రస్తుత రబీలో చివరి వరకు నీటిని అందించడం పెను సవాల్‌గా మారింది. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ను ఆధారంగా చేసుకుని నిర్మించిన ఎత్తిపోతల పథకాలకూ నీటి గండం వెంటాడుతోంది. నాగాపూర్ ఎత్తిపోతల పథకం, జలాల్‌పూర్, బోదేపల్లి లిఫ్టులు, లక్ష్మి కెనాల్‌పై వేంపల్లి ఎత్తిపోతల పథకాలు, వేల్పూర్ మండలంలోని నవాబ్ ట్యాంక్, మోర్తాడ్ మండలంలో చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలు తదితర లిఫ్టులన్నీ నీటి నిల్వలు అందక బోసిపోనున్నాయి. నాగాపూర్ ఎత్తిపోతల పథకాన్ని 1065 అడుగుల వద్ద, జలాల్‌పూర్ ఎత్తిపోతల పథకాన్ని 1050అడుగుల నీటిమట్టం వద్ద, వేంపల్లి, బోదెపల్లి, నవాబ్‌ట్యాంక్ ఎత్తిపోతలను లక్ష్మి కెనాల్ కింద నిర్మించారు. ఈ లిఫ్టులకు నీరందాలంటే లక్ష్మి కాలువ సీల్ లెవల్ 1064 అడుగుల వద్ద ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో పై పథకాలన్నీ ఉత్సవ విగ్రహాలను తలపించనున్నాయి. ఉమ్మడి జిల్లాకు ఏకైక ఆధారంగా ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి కూడా దయనీయంగా మారింది. 1405.20అడుగులు, 17.8టీఎంసిల నీటి సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 1393.62అడుగులు, 5.9టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి వడివడిగా చేరువవుతుండడంతో సుమారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించడంతో పాటు నిజామాబాద్, బోధన్, బాన్సువాడ పట్టణాలకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.