నిజామాబాద్

పంచాయతీల బకాయలు కోటి 20లక్షల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, మార్చి 21: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబందించి, కోటి 20 లక్షల రూపాయల కరెంట్ బకాయిలున్నాయని, కామారెడ్డి జిల్లా ట్రాన్స్‌కోఎస్‌ఈ ఆర్.శేషారావు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలోనూతనంగామంజూరైన డీఈ కార్యాలయంకోసం ఎంపిక చేసిన భవనాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేఖరులతోమాట్లాడారు. జిల్లాలోని జీపీలకు సంబందించిన కోటి 20 లక్షల రూపాయల కరెంట్ బకారుూలున్నాయన్నారు. కరెంట్ బకారుూల వసూలుకు అన్ని రకాల చర్యలు తీసకుంటున్నామన్నారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఎడీఏ కార్యాలయం, ఈఆర్‌ఓ కార్యాలయంను, నూతనంగా ఎంపిక చేసిన డీఈ కార్యాలయం భవనంలోకి త్వరలోమార్చడం జరుగుతోందన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడం జరుగుతోందన్నారు. ఈకార్యక్రమంలోకామారెడ్డి జిల్లా ట్రాన్స్‌కోడీఈ నాగరాజు, అకౌంట్స్ అధికారులు లక్ష్మణ్, చంద్రశేఖర్, ఎల్లారెడ్డి ఇంచార్జి ఎడీఈ కె.నాగేశ్వర్ తోపాటు ట్రాన్స్‌కోసిబ్బంది తదితరులు ఉన్నారు.

ప్రశాంతతకు నిలయాలు ఆలయాలు
* గణపతి సచ్చిదానంద స్వామి
కామారెడ్డి, మార్చి 21: ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవాలయాలే మానసిక ప్రశాంతతను అందచేస్తాయని, భక్తితోనే ముక్తిమార్గం సాధ్యమవుతోందని, కర్నాటకలోని మైసూర్ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని రామేశ్వర్‌పల్లిలో ఉన్న నవనాథ దత్తక్షేత్ర 18వ వార్షికోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితులుగా గణపతి సచ్చిదానంద స్వామిజీ హాజరు అయ్యారు. ఆలయంలో జరిగే హోమానికి ఆయన అంకురార్పణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్ధెశించి ఆయన ప్రవచనాలు విన్పిస్తూ, కష్టాలను ధైర్యంగా ఎదురించిన వారే జీవితంలో పైకి వస్తారని, జీవితం అంటే పుట్టడం, గిట్టడం కాదని, మంచిని గుర్తు చేసుకుంటూ చెడు వదిలేయని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు దాన ధర్మాలు చేయాలన్నారు. ఆలయాల దర్శనాల వల్ల ప్రతి మనిషిలో మార్పు వస్తుందని, ధైవ భక్తి ఉన్నవాడికి ఆ భగవంతుని అండ ఎప్పుడు ఉంటుందన్నారు. ఈకర్మయుగంలో ఈ భూమిపైకి వచ్చిన విషయాన్ని మరిచిపోకుండా మంచి మార్గంతో ముందుకు సాగాలన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించాలన్నారు. మానసిక ప్రశాంతత లేని నాడు ఎంత సంపాదించిన వ్యర్థం అని అన్నారు. చాలా మంది భక్తిని మరిచిపోయి చెడు మార్గాల్లో ప్రయాణిస్తూ చివరకు వారు ఎంతో కోల్పోతున్నారని అన్నారు. అనంతరం ఆలయంలో వేదపండితులు మంత్రోచ్చరణల మద్య గణపతి హోమం, సూర్య హోమం, దేవతలకు అభిషేకాలు చేపట్టారు. భక్తులకు ఆయన ఆశీర్వదించారు. ట్రస్టు ఆధ్వర్యంలో భక్తులకు మహాన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ, క్రిష్ణప్రసాద్‌శర్మ, సంతోష్‌శర్మ, డాక్టర్ వెంకట్, ముత్యపు ఆంజనేయులు, లక్ష్మన్‌రావ్, డాక్టర్ నవీన్‌కుమార్, డాక్టర్ భైరయ్య, చంద్రకాంత్‌రావ్‌తో పాటు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.