నిజామాబాద్

అద్దె బోర్లకు పైప్‌లైన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఏప్రిల్ 22: మోర్తాడ్ మండలంలోని సుంకెట్, రామన్నపేట్ గ్రామాల్లో ఏర్పడిన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారుల బృందం ఏర్పాట్లు చేసింది. మండల అధికారులు రెండు బృందాలుగా విడిపోయి, మండలంలోని పాఠశాలల్లో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి శంకరయ్య నేతృత్వంలో అధికారుల బృందం సుంకెట్, రామన్నపేట గ్రామాల్లో పర్యటించారు. రెండు గ్రామాల్లోనూ వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకుని, వాటి నుండి ట్యాంక్‌లకు నీటిని మళ్లించేందుకు సిడిఎఫ్ నిధుల నుండి కేటాయించిన డబ్బులతో 1400మీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. రామన్నపేట 8వ వార్డుతో పాటు సంతోష్‌కాలనీ, సుంకెట కాలనీల్లో దీనివల్ల నీటి సమస్యకు పరిష్కారం ఏర్పడుతుందని ఎంపిడిఓ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం రెండు గ్రామాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.
గ్రామంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, ఎండిఎంకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. తహశీల్దార్ వెంకట్రావ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మోర్తాడ్‌లోని అన్ని పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రోజువారిగా సంఖ్య పెరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల విఆర్‌ఓలు, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.