నిజామాబాద్

రైతాంగ ప్రయోజనాలే ప్రాధాన్యతగా వ్యాపారాలు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 24: రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, ప్రైవేట్ ఎరువులు, విత్తనాల డీలర్లు చట్టబద్ధంగా తమ వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని కలెక్టర్ ఎం.రాంమోహన్‌రావు హితవు పలికారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రైవేట్ డీలర్లకు స్థానిక మార్కెట్ కమిటీ మీటింగ్ హాల్‌లో శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు మాట్లాడుతూ, డీలర్లు స్వలాభాపేక్ష కోసం రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరించరాదని అన్నారు. నిబంధనలకు లోబడి వ్యాపారాలు సాగిస్తూనే, రైతులు అధిక దిగుబడులు సాధించేలా వారికి సరైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేద్యపు రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా రైతులు సత్వర ఆర్థిక ప్రగతిని సాధించేలా ఎరువులు, క్రిమిసంహారక మందుల డీలర్లు కూడా తమవంతు తోడ్పాటును అందించాలన్నారు. ఏ సమయంలో ఎలాంటి పంటలు వేయాలి, ఏ నేల రకానికి ఏయే పంటలు అనువుగా ఉంటాయి, చీడపీడలు సోకిన సమయంలో వేయాల్సిన మందులు ఏమిటి అనే విషయాల్లో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సాధారణంగా ప్రతీ రైతు తన అవసరాల కోసం డీలర్ల వద్దకు వస్తారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారథులుగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేయాల్సిన గురుతర బాధ్యత డీలర్లపై ఉందని గుర్తు చేశారు. రైతులకు చేయూతను అందించేలా డీలర్లలో పరివర్తన తెచ్చేందుకు ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమానికి సంకల్పించిందని, దీనిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం సైతం ఉంటుందన్నారు. కేవలం లాభార్జనను మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా రైతులకు సరైన దిశానిర్దేశం చేయడాన్ని సామాజిక బాధ్యతగా గుర్తిస్తూ, నైతికతతో మసులుకోవాలని డీలర్లకు ఉద్బోధించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. నకిలీ విత్తనాల కారణంగా కనీసం పెట్టుబడులను సైతం రాబట్టుకోలేని స్థితిలో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పలువురు రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా రైతుల ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు తేవాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగానే ప్రైవేట్ డీలర్లకు కూడా శిక్షణ ఏర్పాటు చేసిందన్నారు. నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు తయారు చేసే కంపెనీలతో పాటు అమ్మే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు చట్టాన్ని కూడా కఠినతరం చేశారని గుర్తు చేశారు. ఈ విషయాలపై డీలర్లు పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన పద్ధతుల్లో రైతులు పంటల సాగు చేపట్టి, తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయ అధికారులు, శాస్తవ్రేత్తలు తమవంతు కృషి చేస్తున్నారని, ఈ కార్యంలో డీలర్లు కూడా భాగస్వాములై రైతాంగ శ్రేయస్సుకు తోడ్పాటును అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల అమ్మకాల్లో పాటించాల్సిన పద్ధతులు, చట్టాల గురించి డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంయుక్త సంచాలకులు గోవింద్, ఏడీఏ వాజిద్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.