క్రైమ్/లీగల్

అడవి పంది దాడిలో దంపతులకు తీవ్ర గాయాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, మార్చి 24: నందిపేట శివార్లలోని పలుగుట్ట సమీపంలో విజయ్‌నగర్ వద్ద శనివారం నిజామాబాద్ నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యభర్తలపై అడవిపంది జరిపిన దాడిలో తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట మండలం కోమట్‌పల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు మగ్గిడి శేఖర్-వాణిలు బైక్‌పై శుక్రవారం నిజామాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లారు. శనివారం భర్యభర్తలిద్దరు బైక్‌పై వస్తుండగా మండల కేంద్ర సమీపంలోని విజయ్‌నగర్ శివార్లలో బీటీ రోడ్డు దాటుతున్న అడవి పందిని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు. సంఘటనలో కిందపడిన భర్త్భర్తలకు గాపయపడి రక్తస్రావం అవుతుండగా, అక్కడే ఉన్న అడవిపంది భయపడుతున్న వాణిని తన నోటితో పట్టుకుని పొదల్లోకి లాక్కేళ్లేందుకు ప్రయత్నించింది. గమనించిన భర్త శేఖర్, ఆమెను గట్టిగా పట్టుకోవడంతో అడవి పంది ఇద్దరిని పొదల్లోకి లాక్కేళ్లి శరీరం మొత్తం కొరిగి గాయపర్చింది. ఈ సంఘటనలో భార్యభర్తలిద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి అరుపులకు శివార్లలోని పంట పొలాల్లో ఉన్న రైతులు అక్కడి చేరుకుని వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

విద్యార్థిని కొట్టిన యాజమాన్యంపై చర్య తీసుకోండి
కామారెడ్డి, మార్చి 24: ఆర్చిడ్స్ పాఠశాలలో అకారణంగా 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని రిషితను చితకబాదిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, శనివారం ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో డిఇవో కార్యాలయంలో ఇంచార్జి నందుసుకేషిణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముదాం ప్రవీణ్ మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులను ప్రేమతో చదవించాల్సింది పోయి విద్యార్థులను ఇష్టానుసరంగా కొట్టడం సరికాదన్నారు. విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలిని తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. పాఠశాల గుర్తింపు రద్దు చేసి, విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలిని తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. పేద విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యాధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధకరమన్నారు. విద్యార్థిని చితకబాధిన కనీసం పాఠశాలను సందర్శించలేని స్థితిలో నేటి విద్యారంగ ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికైన ఆర్కిడ్స్ పాఠశాలలపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లేని యెడల ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి సుధీర్‌కుమార్, జిల్లా సహయకార్యదర్శి దువ్వల నరేశ్, ఎఐవైఎఫ్ నాయకులు పి.రవి, పండు తదితరులు పాల్గొన్నారు.