నిజామాబాద్

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 24: జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య తలేత్తకుండా సమస్యాత్మాక ప్రదేశాలను ప్రతి మండ లం, గ్రామాల వారీగా గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలైన వైకిల్, ట్రాన్స్‌పోర్ట్ వెంటనే ఏర్పాటు చేసే దిశగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వేసవి కార్యాచరణపై మాట్లాడుతూ, తాగునీరు అందుబాటులో లేని గ్రామాలు, మండలాలు, ప్రతీ ఒక్కరికి 20లీటర్ల నీటిని వేసవిలో అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో 86 హ్యబిటేషన్లలో 20ఎల్‌పీ సీడీకంటే తక్కువగా ఉందని, 135 హ్యబిటేషన్లలో 20-30 ఎల్‌సీపీడీలు ఉన్న ప్రాంతాలను సమస్యాత్మాక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. వ్యవసాయ పనులకు హైరింగ్ కోసం 74 లక్షలు, ప్రైవేట్ వ్యవసాయ తాగునీటికై ప్రతి నెల 5వేల రూపాయలు, ప్రతి ట్యాంకర్ 5 వేల లీటర్‌కు 450రూపాయాలు ఐహెచ్‌సీల కంపెనీల ఏజేన్సీలు అందజేస్తాయన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా అన్ని గ్రామ పంచాయితీలకు నిధులను ట్రాన్స్‌పోర్ట్‌కు ఖర్చు చేయాలన్నారు. కొత్త బోర్ వెల్స్‌ను తవ్వడం నిషేధమన్నారు. ఇప్పటివరకు గాంధారి మండలం సర్వాపూర్, కర్ణంగడ్డా తండా, దోమకొండ మండలంలోని దోమకొండ, బంజేపల్లి, రత్నగిరిపల్లి, బిక్కనూరులోని ఇసన్నపల్లి హైరింగ్ హ్యబిటేషన్‌కు నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. గాంధారి మండలం జెమిని తండాలో ట్రాన్స్‌పోర్ట్ హ్యబిటేషన్ వారిగా ఏర్పాటు చేయడమైందన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న 7995660833కు ఫోన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి వెంకటేశ్వర్లు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

విత్తన దుకాణాలు, ప్రాసెసింగ్ ప్లాంట్లలో విజిలెన్స్ తనిఖీ
ఆర్మూర్, మార్చి 24: ఆర్మూర్ పట్టణంతో పాటు మామిడిపల్లి గ్రామ శివారులోని విత్తన దుకాణాలు, ప్రాసెసింగ్ ప్లాంట్లలో విజిలెన్స్ బృందం సభ్యులు శనివారం తనిఖీ చేశారు. మామిడిపల్లి శివారులో గల శ్రీనివాస అగ్రో ఏజెన్సీస్, ఆర్మూర్ పట్టణ శివారులో గల మారుతి సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో విజిలెన్స్ బృందం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తన దుకాణాల లైసెన్సు, స్టాక్ రిజిష్టర్, ఇతర రికార్డులను, ప్రాసెసింగ్ ప్లాంట్లను పరిశీలించారు. ప్రాసెసెంగ్ చేసే విధానం, ప్యాకింగ్, స్టాక్‌ను పరిశీలించి వివరాలు సేకరించారు. నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేయవద్దన్నారు. మార్కెటింగ్ చేయడం, లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్టు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ బృందం ఇన్స్‌పెక్టర్ శ్రీ వినాయక్‌రెడ్డి, విద్యాకర్‌రెడ్డి, ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి వి.గోపి పాల్గొన్నారు.