హైదరాబాద్

టీబీని ప్రాథమిక దశలో గుర్తిస్తే సులువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, మార్చి 24: టీబీ (ట్యూబర్ క్యులాసిస్) క్షయవ్యాధిని ప్రాథమిక దశలోగుర్తిస్తే నివారణ సులువు అవుతోందని, వ్యాధిగ్రస్తులు టీబీ మందులు వాడటంలోనిర్లక్ష్యం వీడితేనే నివారణ సాధ్యం అవుతోందని, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ తిరుమలేష్ అన్నారు. శనివారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భం గా ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ చౌక్ మీదుగా, ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్షయవ్యాధిని పారద్రోలుదాం, సమర్థవంతమైన నాయ కత్వంతోటీబీపై పోరాడుదాం, టీబీని అంతంచేసి చరిత్ర సృష్టిద్దాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ క్షయ (టీబీ) వ్యాధి ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతోందని, క్షయవ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గిన సమీపంలోని ఆరోగ్యవంతులైన వారికి సోకే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి గ్రస్తులు తుమ్మినప్పుడు తుంపర్లు ఆరోగ్యవంతునిపై పడినా ఎదుటి వ్యక్తి తుంపర్లను పీల్చినప్పుడు ఈవ్యాధి సంక్రమిస్తుందన్నారు. టీబీ వ్యాధిని గుర్తించేందుకోసం ప్రభుత్వాసుపత్రు ల్లో ఉచితంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయడం జరుగుతోందన్నారు. వ్యాధిని ప్రాథమిక స్థాయిలోగుర్తిస్తే, తోందరగా నయం అవుతోందన్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీబీ కోర్సు మందులను ఇవ్వడం జరుగుతోందన్నారు. వ్యాధి గ్రస్తులు టీబీ కోర్సునువాడే క్రమంలో నిర్లక్ష్యం వహించవద్దని క్రమంతప్పక కోర్సు ప్రకారం వాడితే ఈవ్యాధి పూర్తిగా నయం అవుతోందన్నారు. కార్యక్రమంలోమత్తమాల పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్ దివ్యగోపీనాథ్, హెచ్‌ఈఓ విక్రమచారీ, హెల్త్ సూపర్‌వైజర్‌లు మధుసుధన్, సుధాకర్, వెంకటనారాయణ, చంద్రనాగమ్మ, చిన్ని, సిబ్బంది అశ్వఖ్, ఆశావర్కర్‌లు లావణ్య, సునిత తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం భూములను పరిశీలించిన జేసీ
తాడ్వాయి, మార్చి 24: మండలంలోని దేవాయిపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని కాళేశ్వరం కాలువ భూములను శనివారం కామారెడ్డి జాయింట్‌కలెక్టర్ సత్తయ్య పరిశీలించారు. భూములు కోల్పోయిన రైతులతో ఆయన మాట్లాడారు. సరిహద్దుల్లో భూములను పరిశీలించారు. రైతులు తమకు మార్కెట్ రేట్‌కు అనుగుణంగా డబ్బులు చెల్లించాలని కోరగా కామారెడ్డిలో ఇందుకోసం త్వరల్లో సమావేశం ఏర్పాటు చేసి భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడి ధరలు నిర్ణయిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, తహశీల్దార్ బాసిత్, క్రిష్ణాజివాడి ఉప సర్పంచ్ రామరాజు, సభ్యుడు సాయిలు పాల్గొన్నారు.