క్రైమ్/లీగల్

సినీ ఫక్కీలో నగల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, ఏప్రిల్ 3: బాన్సువాడ మండలంలోని గౌలిగూడ ప్రాంతంలో మంగళవారం సినీ పక్కీలో చోరీ జరిగింది. అమాయక మహిళలను నమ్మించి మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించుకు పోయారు. ఈ సంఘటణపై బాన్సువాడ టౌన్ సీఐ. శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గౌలిగూడ ప్రాంతానికి చెందిన రుక్మిణీకి స్కీంలో ద్విచక్ర వాహనం డ్రాలో వచ్చిందని నమ్మబలికి అమెను షోరూంకు రావాల్సిందిగా సూచించారు. వారి మాటలను నమ్మిన రుక్మిణి వాహణం కోసం ఇంటి నుండి బయలు దేరేందుకు సిద్ధమవుతుండగా, మెడలో ఉన్న బంగారు గొలుసును ఇంట్లో దాచి రావాలని, లేదంటే వాహనం అప్పగించేందుకు నిరాకరిస్తారని చెప్పడంతో మెడలో ఉన్న గొలుసును కిచెన్‌లోని స్టీల్ డబ్బాలో వారి ముందే దాచి ఉంచి ఇంటి నుండి బయలు దేరింది. వారు తెచ్చిన ఆటోలో ప్రయాణం చేసిన అమెను మార్గమధ్యంలో తాము బోజన చేసి వస్తామని, మీరు షోరూం వద్దకు వెళ్లాలని చెప్పడంతో మహిళ వారి మాటలు నమ్మి షోరూం వద్దకు చేరుకుంది. ఇంతలోపు అటోలో వచ్చిన మాయగాళ్లు మహిళ ఇంటికి చేరుకొని ఇంట్లో దాచి ఉంచిన బంగారు గొలుసును తీసుకొని తస్కరించారు. వాస్తవం తెలిసిన తరువాత మహిళ తాను మోసపోయానని, ఇంట్లో తాను దాచి ఉంచిన బంగారు గొలుసును అపహరించుకుపోయారని బాదితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. పిర్యాదును పరిగణంలోకి తీసుకొని స్థానిక సి ఐ శేఖర్ రెడ్డి విచారణ చేపట్టగా గుర్తు తెలియని వ్యక్తులు మహిళను మోసం చేసి రెండున్నర తులాల బంగారు గొలుసును అపహరించుకు పోయినట్లు నిర్ధారించడం జరిగిందని చెప్పారు. అగంతకుల కోసం గాలింపు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు.