నిజామాబాద్

రైతుబంధు చెక్కుల పంపిణీకి షెడ్యూల్ సిద్ధం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఏప్రిల్ 20: రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో భాగంగా మే 10నుండి 16వరకు చెక్కుల పంపిణీ చేపట్టడం జరుగుతుందని, అందుకు సంబంధించి ఆయా మండలాల తహశీల్దార్లు షెడ్యుల్ తయారుచేసి పంపించాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు ఆదేశించారు. శుక్రవారం ఉదయం జేసీ ఏ.రవీందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు ప్రతి 300ఖాతాలకు సంబంధించిన రైతులకు చెక్కులతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి గ్రామంలో ఉన్న ఖాతాలకు అనుగుణంగా బృం దంసభ్యులతో నివేదికను సిద్ధం చేయాలన్నారు. షెడ్యూల్ వివరాలను శాసన సభ్యులకు తెలియజేస్తూ వారి సలహా, సూచనల మేరకు తయారు చేయాలన్నారు. ఈ చెక్కుల పంపిణీలో వ్యవసాయ విస్తీర్ణ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని, చెక్కుల పంపి ణీ అనంతరం అధికారులవద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లలో వివరాలను అప్‌లోడ్ చేయా ల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. అదే విధంగా రైతులకు అందించిన పట్టాదారు పాసుప్తుకాలకు సంబంధించిన రశీదును తీసుకోవాలన్నారు. చెక్కు ల పంపిణీ పారదర్శకంగా, నిబద్ధతతో చేపట్టాలని, ఒక్కొ బృందంలో ముగ్గు రు నుండి నలుగు సభ్యులు ఉంటే విధంగా చూసుకోవాలన్నారు. ఇందుకోసం అవసరమైతే ఆయా శాఖల మండల, గ్రామ స్థాయి అధికారులను నియమించుకోవాలన్నారు. బృందంలో ఏఇఓ, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, ఆర్‌ఐ లేదా సీనియర్ అసిస్టెంట్‌లు సేవలు వినియోగించుకునేలా షెడ్యూల్ తయారు చేసుకోవాలన్నారు. చెక్కుల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగా చిన్న గ్రామాలను ఎంపిక చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సూపర్‌వైజర్లుగా ఎంపీడీఓ, తహశీల్దార్, ఇఓపీఆర్‌డీలను నియమించాలని, పంపిణీలో ఎలాంటి సందేహాలు వచ్చిన వెంటనే జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు సూచించారు. అందరి దృష్టి చెక్కులు, పట్టాదారుపాసు పుస్తకాలపైనే ఉంటుందని, అందువల్ల ఏ ఒక్క చిన్న పొరపాటు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేడీఏ గోవింద్, ఆర్డీవో వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధియే ప్రధాన ఏజెండా
* ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
మోర్తాడ్, ఏప్రిల్ 20: రాజకీయాలకు అతీతంగా బాల్కొండ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని మోర్తాడ్, దొన్కల్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. మోర్తాడ్ బస్టాండ్‌లో ఇన్ గేట్ నుండి అవుట్ గేట్ వరకు పూర్తిస్థాయిలో సీసీ.రోడ్డు నిర్మాణానికి 22లక్షల రూపాయల నిధులు కేటాయించడంతో ఆయన పనులను ప్రారంభించారు. దొన్కల్‌లో 20లక్షలతో, మోర్తాడ్‌లో 50లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని భావించామని, దానికి అనుగుణంగానే కోట్లాది రూపాయల వ్యయంతో నియోజకవర్గ అభివృద్ధి చేపడుతున్నామని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారికంటే ముందుగానే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథ పనులను కూడా శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఇంటింటికి నీటిని సరఫరా చేస్తామని అన్నారు. వరదకాల్వ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపేందుకు చేపట్టిన రివర్స్ పంపింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, 2019 జూలై కల్లా కాళేశ్వరం జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద అతి త్వరలోనే చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడ్తామని స్పష్టం చేశారు. తాము చేస్తున్న అభివృద్ధి చూసి జీర్ణించుకోలేకనే కొందరు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎవరెన్నీ ప్రయత్నాలు చేసినా తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో తాము మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లెడ చిన్నయ్య, సర్పంచ్‌లు హన్మాగౌడ్, దడివె నవీన్, ఉగ్గేర భూమేశ్వర్, ఎంపీటీసీలు మురళీగౌడ్, పాపాయి పవన్, లక్ష్మి, కాశీరాం, ఎంపీడీఓ శ్రీనివాస్, ఆర్టీసీ అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.