నిజామాబాద్

చుక్క నీటిని కూడా వృధా చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నసరుల్లాబాద్, ఏప్రిల్ 20: రాబోయే వర్షాకాలంలో విడుదల అయ్యే కాళేశ్వరం నీటిని చుక్క నీటిని కూడా వృధా కానివ్వోద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీర్కూర్ గ్రామ శివారులో గల తెలంగాణ తిరుమల ఆలయానికి విచ్చేసిన మంత్రి పోచారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో 13కోట్లతో నిర్మిస్తున్న ఆభివృద్ది పనులను పరిశీలించారు. ఆనంతరం ఏర్పాటుచేసిన ఇరిగేషన్ అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ త్వరల్లో విడుదల అయ్యే కాళేశ్వరం నీటిని వృధా కాకుండా చివరి ఆయకట్టు రైతులకు నీరు చేరేలా చూడాలని ఆధికారులకు సూచించారు. నియోజకవర్గంలో అన్ని చోట్ల లిప్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అయ్యాయని కోటగిరి మండలం కుడిచెర్ల గ్రామ పరివాక ప్రాంతంలో 11కోట్ల 24లక్షలతో లిప్టింగ్ ఇరిగేషన్ పనులను త్వరాల్లో ప్రారంభిస్తామని దీని వల్ల 1130 ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు. నియోజకవర్గంలోని నిజాంసాగర్ 8వ డిస్టిబ్యూటర్ నుంచి 40 డిస్టిబ్యూటర్ వరకు 115 కోట్ల రూపాయాల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, ఆదనంగా 18 కోట్ల రూపాయాలు నూతన పనులకు ప్రతిపాదనలు పంపి కాళ్ళేశ్వర నీటిని చివరి ఆయాకట్టుకు చేరేలా చూస్తామన్నారు. మంజీరా నదితో ఆరు చోట్లతో చెక్ డ్యాంక్‌లు నిర్మిస్తున్నామని, దీన్ని వల్ల భూగర్భా జలాలు పెరుగుతాయన్నారు. నియోజకవర్గంలో 58 నూతన పంచాయతీ నిర్మాణాలకు ఆమోదం లభించిందని, త్వరాల్లో పనులు చేపడుతామని వివరించారు. బీర్కూర్ మండలంలోదామారాంచ, కిష్టాపూర్, బైరాపూర్, నసరుల్లాబాద్ మండలంలోని సంగెం, మిర్జాపూర్, నసరుల్లాబాద్, మైలారం, ఒక్కొక్క గ్రామ పంచాయితీకి 16 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని అన్నారు. మే నెల 10వ తేదీ నుంచి పంట పెట్టుబడి ద్వారా ఎకరానికి నాలుగు వేల రూపాయలను అందిస్తున్నామని, రైతులకు అందించిన వ్యక్తి గత చెక్కులను తమకు ఖాతాలు ఉన్న ఏ బ్యాంక్‌ల్లో నైనా వేసుకోవాలని బ్యాంకర్లకు రైతులకు ఇబ్బందులు కల్గించకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సతీశ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అశోక్, ఎంపీపీ మల్లెల మీన, హన్మంతు, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రఘు, బీర్కూర్ సర్పంచ్ నర్సయ్య, ఇరిగేషన్ అధికారులు, మైలారం సోసైటీ చైర్మన్ అప్పారావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సేవలను గుర్తించే కాయకల్ప అవార్డు
* ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి మంత్రి అభినందనలు
బాన్సువాడ, ఏప్రిల్ 20: రోగుల పట్ల మానవత్వ ధోరణిని అనుసరించి, వారికి సకాలంలో వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్న సేవలతో పాటు పరిసరాలు, పరిశుభ్రత, పచ్చదనం అంశాలను పరిగణంలోకి తీసుకొని బాన్సువాడ ఏరియాసుపత్రికి కాయకల్ప కింద కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడకు వచ్చిన మంత్రిని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, వైద్యురాలు సుధా, సిబ్బంది పోచారం స్వగృహంలో కలిసారు. ఈ సందర్బంగా కాయకల్ప అవార్డును కేంద్ర మంత్రి నడ్డా చేతుల మీదుగా అందుకున్నందుకు వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి మరిన్ని అవార్డులను ఆపాదించుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరై ఆసుపత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్య సదుపాయాలను అందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బంది తోడ్పాటు నందించాలని చెప్పారు. ఆయన వెంట టీ ఆర్ ఎస్ నాయకులు అంజిరెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, ఎజాజ్, నార్ల సురేష్, కొత్తకొండ బాస్కర్ , ఎజాజ్ తదితరులు ఉన్నారు.