నిజామాబాద్

కొనుగొలు కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఏప్రిల్ 26: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు వసతులు సమకూర్చుకోవాలని, ఎండ తీవ్రతపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టెంట్‌ల సౌకర్యం, మంచినీటి సౌకర్యం కల్పించాలని, అగ్ని ప్రమాదాలు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే హమాలీలను పెంచుకోవాలని, తప్పనిసరిగా 24 గంటలలోపు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి లోడ్ చేయాలన్నారు. జిల్లాలో 201 ధాన్యం కొనుగొలు కేంద్రాలకు గాను 65 కేంద్రాలు ప్రారంభం అయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు లక్షా 76 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి 29కోట్ల విలువ గల మొత్తంలో 7 కోట్ల 29 లక్షల రూపాయిలు 585 మంది రైతులకు అందజేయడం జరిగిందన్నారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని తీసుకురావాలని, ధాన్యంతో పాటు వెంట సంబంధిత పత్రాలు తీసుకురావాలని, 24 గంటలోపు పేమెంట్ పొందాలని తెలిపారు. 23 మొక్కజొన్న కొనుగొలు కేంద్రాలు ప్రారంభమైనయని, ఇప్పటి వరకు 29 వేల 863 క్వింటాళ్ల మొక్కజొన్నలు కొనడం జరిగిందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్తయ్య, ఆర్డీవో శ్రీను, డిఎంసివిల్ సప్లయ్ ఇర్పాన్, డిఎస్‌వో రమేష్, మార్కెటింగ్ ఎడి గంగు, కామారెడ్డి మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగం తదితరులు పాల్గొన్నారు.

తమ పాలనలో రోడ్లకు మహర్ధ
* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం
నస్రూల్లాబాద్, ఏప్రిల్ 26: తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అంతటా రోడ్లు అభివృద్ధి చెందాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం బీర్కూర్ గ్రామంలో మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి బీర్కూర్ గ్రామం వరకు 8కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబూల్ రోడ్డు నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామం నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రాష్టమ్రంతటా నూతన రోడ్ల నిర్మాణం జరిగాయని అన్నారు. మంజీరా పరివాహక ప్రాంతం నంచి బీర్కూర్ గ్రామ వరకు నిర్మించే రోడ్డు వల్ల మహారాష్ట్ర, తెలంగాణకు కలిసిపోతాయన్నారు. దీంతో ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయన్నారు. అంతకు ముందు పోచారం కాలనీల్లో వౌలిక సదుపాయాలు అయిన సీసీ రోడ్లు, వేగంగా పూర్తిగా నిర్మాణం చేపట్టినందుకు మంత్రి అభినందించారు.