నిజామాబాద్

కేంద్ర అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నర్సింహారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్ రూరల్, ఏప్రిల్ 26: బోధన్ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది నర్సింహారెడ్డి కేంద్ర న్యాయశాఖ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ నుండి నియామక పత్రాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తాను 30 ఏళ్లుగా న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నానని, తాను చేసిన సేవలను గుర్తించి నేడు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించారని వివరించారు. బోధన్ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తున్న నర్సింహారెడ్డి భారతీయ జనతా పార్టీలో 30ఏళ్లుగా క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ అనేక రకాల పదవులలో కొనసాగారు.

29న ఢిల్లీలో ఆక్రోశ్ దివస్ ర్యాలీ
* డీసీసీ అధ్యక్షుడు తాహెర్
కంఠేశ్వర్, ఏప్రిల్ 26: దళితుల పట్ల, మహిళల పట్ల కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 29న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అక్రోశ్ దివస్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చాక దళితులపై, మహిళలపై ముఖ్యంగా చిన్నారులపై లైంగిక దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాహుల్‌గాంధీ మొట్ట మొదటిసారిగా వీటన్నింటిపై కలత చెంది దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 29న ఆక్రోశ్ దివస్ పేరిట భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టడం జరిగిందన్నారు. ఈ ర్యాలీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని, తమ వెంట ఆధార్ కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఇక రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని తాహెర్ ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కేశ వేణు, ముప్ప గంగారెడ్డి, మీసాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.

ఎల్లారెడ్డిలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
* సీపీసీ సెక్షన్ 41(ఏ) సవరణ రద్దుచేయాలని డిమాండ్ * బార్ అసోషియేషన్ అధ్యక్షుడు గోపాల్‌రావు
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 26: రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరించడం సమంజసం కాదని, ఇందుకు నిరసనగా గురువారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక సివిల్ మరియు క్రిమినల్ కోర్టు బార్ ఆసోషియేషన్ అధ్యక్షుడు గోపాల్‌రావు నేతృత్వంలోన్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్‌అసోషియేషన్ మరియు నిజామాబాద్ బార్ అసోషియేషన్ సభ్యుల పిలుపుమేరకు ఒక రోజు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సీపీసీ (క్రిమినల్ ప్రోసీజర్ కోడ్) లోని సెక్షన్ 41(ఏ) సవరణను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలోకీలకంగా వ్యవహరించిన న్యాయవాధుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక కోర్టు న్యాయవాధులు సాయిప్రకాష్‌దేశ్‌పాండే, నామ శ్రీనివాస్‌రావు, సతీష్‌కుమార్, పద్మపండరీ, నవీద్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.

కరగ్ గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి
మద్నూర్, ఏప్రిల్ 26: రాష్ట్రప్రభుత్వం ఒక వైపు మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటా త్రాగునీటిని అందిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికి, కొన్ని గ్రామాల్లో వేసవి దృష్ట్యా త్రాగునీటికి కటకట తప్పడం లేదు. మద్నూర్ మండలంలోని కరగ్ గ్రామంలోగత వారం రోజుల నుంచి త్రాగునీటి కోసం మహిళలు నానా ఇబ్బందులు పడ్తున్నారు. బోరుబావుల్లో నీరు అడుగంటడంతో, వ్యవసాయ బోరుబావుల నుంచి నెత్తిన బిందెలతోమహిళలు దాదాపుగా కిలోమీటరు దూరం నుంచి తీసుకువస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో త్రాగునీటి ఎద్దడిని తీర్చేలా చర్యలుతీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎండాకాలంను దృష్టిలోఉంచుకుని త్రాగునీటి ఎద్దడి నివారించేందుకోసం ప్రత్యామ్మయ మార్గాలను అనే్వషించాలని, గ్రామస్థులు, మహిళలు సంబందిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.