నిజామాబాద్

నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మే 22: ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, ఆయా మండలాల ఎంపీడీఓలు, ఇఓపీఆర్‌డీలను ఆదేశించారు. మంగళవారం స్థానిక వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలతో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గతంలోనే సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, అయినప్పటికీ, దర్పల్లి, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, నందిపేట తదితర మండలాల్లో తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టిన కథనాలు పత్రికల్లో ప్రచురించడం జరిగిందని, ఇకనుండి ఎక్కడైనా తాగునీటి ఇక్కట్లు ఎదురైతే సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు చెక్కులు, పట్టా పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమం ఈ నెల 19తో ముగియగా, మిగిలిపోయిన రైతులకు కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. పట్టా పాస్‌బుక్‌లు, చెక్కుల పంపిణీ తర్వాత మోబైల్ యాప్‌లో లోడ్ చేస్తూ వెంటది వెంట అప్ డేట్ చేయాలన్నారు. ఫింగరేస్ ఆప్ లైన్‌లో, ఆన్‌లైన్‌లో ఎట్టి పరిస్థితుల్లో తేడాలు ఉండరాదన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని తహశీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. ఇక గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా కూలీలకు నీడ, మంచినీటి సౌకర్యంతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ఎండలు తీవ్రంగా కాస్తున్నందున ఉదయం 11గంటల్లోపే పనులు ముగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తోందని, వీటి ప్రాసెస్‌లో పురోగతి సాధించాలని తహశీల్దార్లకు సూచించారు. కొత్త గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వాహణకు గాను ఎంపీడీఓలు కొత్త పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి డీఆర్‌ఓ వినోద్‌కుమార్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమేష్, డీపీఓ కృష్ణమూర్తి, ఇఇ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

500కి.మీ మారథాన్ రన్‌కు
*స్వాగతం పలికిన ఎస్‌ఐ రామునాయుడు
మాక్లూర్, మే 22: పోలీసు శాఖతో ప్రజలు మమేకం అయ్యేలా నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్‌కు చెందిన బీ.గంగారాం అనే కానిస్టేబుల్ చేపట్టిన ‘బీ ద ఛేంజ్’ 500కిలోమీటర్ల మారథాన్ రన్‌కు మాక్లూర్ ఎస్‌ఐ రామునాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ, నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో నెల రోజుల పాటు కొనసాగే ఈ యాత్రను మంగళవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా మాక్లూర్‌కు చేరుకోగా, స్వాగతం పలుకడం జరిగిందన్నారు. మండల శివార్ల వరకు మారథాన్ బృందం వెంట వెళ్లి, నందిపేట మండల ప్రారంభం వద్ద వీడ్కోలు చెప్పడం జరిగిందన్నారు. ఈ మారథాన్ రన్‌లో ప్రజలతో మమేకం అయ్యేందుకు పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజలను చైతన్యపర్చడం జరుగుతుందని ఎస్‌ఐ తెలిపారు.