నిజామాబాద్

వదంతులను నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 22: గత కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎంతమాత్రం నమ్మవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ సూచించారు. మనుషులను కిరాతకంగా హతమార్చి వారి మెదడు, ఇతర శరీర అవయవాలు తినే నరహంతక ముఠాలు జిల్లాలలో సంచరిస్తున్నాయని, పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు తిరుగుతున్నాయని, చిన్నారుల ఏడుపు ధ్వనిని అనుకరిస్తూ తలుపులు తెరిచిన వెంటనే దాడి చేసి చోరీలకు పాల్పడుతున్నారంటూ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మెస్సేజ్‌లు వైరల్ అవుతుండడంతో ప్రజలు ఒకింత భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇవన్నీ కేవలం వదంతులేనని, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనుషులను చంపి మెదడును తినే ముఠాలు కానీ, చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే అంతర్రాష్ట్ర ముఠాలు అంటూ ఏవీ సంచరించడం లేదని సీ.పీ కార్తికేయ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. కేవలం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ తరహా ముఠాల ఆనవాళ్లు బయటపడలేదని, ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కాలేదని వివరించారు. కొంతమంది పోకిరీలు అపరిపక్వతతో ఈ తరహా మెస్సేజ్‌లను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. నిజానికి కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భ్లూకోల్ట్స్, ఇంటర్‌సెప్టర్ వాహనాలు, సాయుధ పోలీసుల నిరంతర గస్తీ, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్, వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల కదలికలను సునాయసంగా పసిగడుతూ వారిని చాలామటుకు ముందుగానే నిలువరించగల్గుతున్నామని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించిన వెంటనే వారు రెండు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుంటారని సీ.పీ కార్తికేయ భరోసా కల్పించారు.
500కి.మీ మారథాన్ రన్‌ను ప్రారంభించిన సీ.పీ కార్తికేయ
జిల్లా కేంద్రంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బీ.గంగారాం అనే కానిస్టేబుల్ ప్రత్యేక లక్ష్యంతో చేపట్టిన 500కిలోమీటర్ల మారథాన్ రన్‌ను మంగళవారం పోలీస్ కమిషనర్ కార్తికేయ జెండా ఊపి ప్రారంభించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో నెల రోజుల వ్యవధిలో 500కిలోమీటర్ల మారథాన్ రన్‌ను పూర్తి చేయనున్నారు. తొలిరోజున నిజామాబాద్ నుండి మాక్లూర్ వరకు తన పరుగును కొనసాగించారు. పోలీసు శాఖతో ప్రజలు మమేకం అయ్యేలా ‘బీ ద ఛేంజ్’ నినాదంతో గంగారాం ఈ సుదీర్ఘ పరుగును చేపట్టారు. ఈ సందర్భంగా సీ.పీ కార్తికేయ మాట్లాడుతూ, గంగారాం గతంలో 2003 సంవత్సరంలో కమాండో శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. తన శారీరక దారుఢ్యాన్ని కాపాడుకుంటూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరంగ్ జిల్లాలో బేసింగ్ మానిటరింగ్ కోర్సు పూర్తి చేసి గౌరీచందర్‌ఫీట్‌లో 6250 మీటర్ల శిక్షణ అధిరోహించారని అన్నారు. అనంతరం హిమాచల్‌ప్రదేశ్‌లోని అడ్వాన్స్ శిక్షణ కోర్సును 30రోజుల్లోనే పూర్తి చేసి, కులూమనాలీలో 17వేల అడుగుల ఎత్తు ఉండే హైవౌంట్‌ను అధిరోహించారని వివరించారు. ప్రస్తుతం స్పష్టమైన లక్ష్యంతో చేపట్టిన 500కిలోమీటర్ల మారథాన్ రన్‌ను కూడా నిర్దిష్ట గడువులోగా పూర్తి చేస్తారని, అనంతరం ఎవరెస్టు శిఖరాన్ని సైతం అధిరోహిస్తారనే పూర్తి నమ్మకం తనకు ఉందని సీ.పీ కార్తికేయ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ప్రతిరోజు 15 నుండి 20కిలోమీటర్ల మేర పరుగు తీస్తూ లక్ష్యాన్ని సాధిస్తానని గంగారాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ఎం.సుదర్శన్, ఆర్‌ఐలు మల్లికార్జున్, శేఖర్, శైలేందర్, పెద్దన్న, టౌన్ సీఐ సుభాష్‌చంద్రబోస్, రూరల్ సీఐ బుచ్చయ్య, టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.