నిజామాబాద్

మంజీరాను తవ్వేస్తున్నారు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, మే 22: బాన్సువాడలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. రాత్రి వేళల్లో ఇసుకను దొడ్డిదారిన తరలించుకుంటున్నారు. మంజీరా పరివాహక ప్రాంతం నుండి ఇసుకను అనుమతి లేకుండా రవాణా చేసుకుంటున్నారు. చింతల నాగారం ప్రాంతం నుండి ట్రాక్టర్లలో ఇసుకను తరిలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే కాకుండా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పేరిట వే బిల్లులను పొంది ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్న 14 ట్రాక్టర్లను మాసం రోజుల క్రితం బాన్సువాడ సి ఐ శేఖర్ రెడ్డి సీజ్ చేశారు. వ్యవసాయ రైతులకు ప్రభుత్వం అందించిన సబ్సీడీ ట్రాక్టర్లపై దేశాయిపేట్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరిట అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు అందిన పక్కా సమాచారం మెరకు బాన్సువాడ పట్టణంలో ఇసుక ట్రాక్టర్లను నిలిపి వే బిల్లులను పరిశీలించడంతో ఇసుకాసురుల బండారం బట్టబయలైంది. వే బిల్లులో డబుల్ బెడ్ రూం కోసం అనుమతి ఉండగా, ఇసుక రవాణాదారులు ఇతర చోట్ల ఇసుకను దిగుమతి చేయడాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్రగతి పనుల చాటున ఇసుక వ్యాపారులు ప్రైవేటు భవనాల నిర్మాణం కోసం అమ్ముకుంటున్నట్లు నిర్ధారించారు. సమాచారాన్ని అందుకున్న సి ఐ ఠాణాకు వచ్చి వేబిల్లులను పరిశీలించారు. అనుమతులు ఒకచోటైతే ఇసుకను దిగుమతి చేసింది మరోచోట కావడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమ ఇసుక రవాణా కింద కేసులు నమోదు చేయాలని సిఐని డీఎస్పీ నర్సింహారావ్ ఆదేశించారు. అంతకు ముందు ఆర్డీఓ కు సమాచారం అందించి అధికారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ఆర్డీఓ రాజేశ్వర్ కూడా ఇసుక అక్రమ రవాణా అవుతున్నట్లు నిర్ధారించి వాహనాలను సీజ్ చేయాలని, రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని సి ఐకి సూచించారు. గత కొన్ని రోజులుగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పేరిట బీర్కూర్ నుండి ఇసుకను బాన్సువాడకు తరలించుకుంటున్నారు. దొడ్డి దారిన వేబిల్లులను పొందుతూ వాటి చాటున ఇసుకను రవాణా చేస్తున్నారు. వ్యవసాయ దిగుబడులు, ఇతర సామాగ్రిని దిగుమతి, ఎగుమతులను చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సీడీ కింద ట్రాక్టర్లను మంజూరు చేసింది. అట్టి ట్రాక్టర్లను మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే వినియోగించాలి. కాని అక్రమార్జణకు ఆశపడి సబ్సీడీ ట్రాక్టర్లపై ఇసుక రవాణా చేస్తూ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు దృష్టి సారించడంతో ఇసుక వ్యాపారుల దందా వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్లను ఠాణాకు తరలించి ఇసుక వ్యాపారులపై చర్యలకు అధికారులు ఉపక్రమించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడి పట్టుబడ్డ వాహనాలను తప్పించేందుకు స్థానిక నేతల నుండి పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు అధికారులు ఇసుక విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో ఇసుక వ్యాపారుల ఇరుకాటంలో పడ్డారు.
అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించం: ఆర్డీఓ రాజేశ్వర్
అనుమతి లేకుండా చింతల నాగారం, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రాజేశ్వర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరిట ఇసుక దారి మళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశాయిపేట్ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పేరిట వేబిల్లులను పొంది బాన్సువాడ పట్టణంలో ఇసుకను దిగుమతి చేసి అక్రమ రవాణాకు పాల్పడ్డారని నిర్ధారించడం జరిగిందని ఆర్డీఓ రాజేశ్వర్ తెలిపారు.

మోడీ ప్రభుత్వ పాలనలో
ప్రగతి వైపు దేశం పరుగులు

నిజామాబాద్ రూరల్, మే 22: కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రభుత్వం సమర్ధవంతమైన నిర్ణయాలతో ముందుకెళ్తుండడం వల్ల దేశం అన్ని రంగాల్లో ప్రగతి దిశగా పరుగులు పెడుతోందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి గడ్డం ఆనంద్‌రెడ్డి అన్నారు. మంగళవారం మోపాల్ మండలంలోని ఆయా గ్రామ శివార్లలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆయన వారికి అవగాహన కల్పించారు. గడిచిన 60సంవత్సరాలలో సాధించలేని అనేక కార్యక్రమాలను కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే చేసి చూపించిన ఘనత మోడీ సర్కార్‌కే దక్కిందన్నారు. ఏ చిన్నపాటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు తావులేకుండా సామాన్య ప్రజలకు కూడా జవాబుదారితనంతో పాలన సాగిస్తున్నారని కొనియాడారు. నిరుపేద, సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేస్తూ అనారోగ్యాల బారినపడుతున్నారని గుర్తించి, ఉజ్వల పథకం కింద లక్షలాది మందికి ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్ యూనిట్లను అందజేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అవగాహనను పెంపొందించుకుని, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కూలీలకు పని ప్రదేశాల్లో నిబంధనలకు అనుగుణంగా అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించాలని ఈజీఎస్ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. ఆయన వెంట నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.