నిజామాబాద్

యోగా దినోత్సవానికి తరలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జూన్ 18: ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతిఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయూ ష్, నెహ్రు యువ కేంద్రం, జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి చేపట్టిన యోగా అవగాహన ర్యాలీని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా గొప్ప వరమని, ప్రతి ఒక్కరు యోగా గురించి తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలు, చరిత్రలో యోగా ఒక భాగమని, పూర్వీకులు ప్రతిరోజు యోగా చేయడంవల్ల వ్యాధులకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. అందువల్ల ఈ పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరు యోగాపై అవగాహన పెంచుకుని, ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. యోగా అవగాహన ర్యాలీ తిలక్‌గార్డెన్, బస్టాండ్ మీదుగా గాంధీచౌక్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో ఆయూష్, ఎన్‌వైకే, యోగా ప్రతినిధులు రాంచందర్‌రావు, నీలి రాంచందర్, తోట రాజశేఖర్, రాజేందర్, డాక్టర్ మనోహర్, గంగాదాస్, డాక్టర్ తిరుపతితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.