నిజామాబాద్

ప్రజల కష్టాలను చూసి సోనియా తెలంగాణ ఇచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, జూన్ 18: తెలంగాణ ప్రజల కష్టాలను చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్ ముక్కును చూసి ఇవ్వలేదని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయన సోమవారం మండలంలోని చిన్నమల్లారెడ్డి, లింగాయిపల్లి గ్రామా ల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. చిన్నమల్లారెడ్డి, లింగాయిపల్లి గ్రామాల్లో సామాజిక భవనాల కోసం 14 లక్షాలు మంజూరు చేసిన్నట్లు ఆయన ప్రకటించారు. 2014 ఎన్నికల్లో ప్రభుత్వ విప్ గంపగోవర్థన్ నేను పెదొన్ని అంటు నాకు ఇల్లు లేదని, కులమాతాలపేరుతో ప్రచారంచేసి ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. పేదల ఓట్లతో గెలిచి కోట్ల రూపాయలు దన్నుకుంటున్నారన్నారు. రైతుబంధు పథ కం, భూస్వాములు, పెద్దందారుల, ఎన్నారైలాకోసం ప్రవేశపెట్టిందన్నారు. కేసీఆర్ మోసపురితమైన వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దళితులకు మూడు ఎకారాల భూమి, కేజీటూపీజీ, దళిత ముఖ్యమంత్రి వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ చేసిన అభివృద్ధి పనులు ఏమి లేవన్నారు. యంత్రలక్ష్మి కిందవచ్చిన ట్రాక్టర్లను టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకే దక్కాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 12వేల కోట్ల మిగులు నిధు లుచూపిస్తే, కేసీఆర్ 2లక్షలకోట్ల ఆప్పు లు చూపిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టం కడుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నిమ్మ మోహన్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, ఎంపీటీసీ లక్ష్మిరాజాగౌడ్, నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, గుడెం శ్రీనివాస్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు నరేశ్, నాయకులు కిషన్, గోపాల్, ఎల్లారెడ్డి ఆనంద్‌రావు, భూపాల్‌రెడ్డి, బాల్‌రాజు పాల్గొన్నారు.