నిజామాబాద్

పీజీ బ్యాక్‌లాగ్, సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, జూన్ 21: తెలంగాణ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పరీక్షా కేంద్రంలో పీ.జీ బ్యాక్‌లాగ్, సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి. అన్ని అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులు యూనివర్శిటీలో నిర్వహించిన ఈ పరీక్షా కేంద్రానికి హాజరై పరీక్షలు రాశారు. వర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సాంబయ్య పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరీక్షలు జరిపించాలని అధ్యాపకులకు సూచించారు. పరీక్షా కేంద్రంలోని వసతులను పరిశీలించి, ఇంకేమైనా సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? అని ఆరా తీశారు. కాగా, తొలిరోజు పీ.జీలోని అన్ని కోర్సులకు సంబంధించి ఒకటి, ఐదు, ఏడు, తొమ్మిది సెమిస్టర్ల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 360 మందికి గాను 307 మంది హాజరయ్యారని, 53 మంది గైర్హాజర్ అయినట్టు అధికారులు తెలిపారు. వీ.సీ వెంట తెలంగాణ వర్శిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ నాగరాజు, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్, చీఫ్ సూపరింటెండెంట్ కే.రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

పోడు భూములకు కొత్త పాస్‌బుక్కులు ఇవ్వాలి
కంఠేశ్వర్, జూన్ 21: జిల్లాలో అసైన్డ్, పోడు భూములు కలిగి ఉన్న రైతులకు కొత్త పాసుబుక్కులు, రైతుబంధు చెక్కులు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ.ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుండి ప్రదర్శన చేపట్టి, కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు పట్టాలు అందించిన అసైన్డ్ భూములకు, గత నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు, అటవీ భూములకు నూతన పాస్‌బుక్కులు ఇచ్చి రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 4వేల రూపాయల చొప్పున చెక్కులు అందించాలన్నారు. వందల ఎకరాల భూస్వాములకు, కార్పొరేట్ సంస్థలకు ప్రజల సొమ్మును టోకున అందించి, ప్రజలను నిండా ముంచడం కోసమే ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. జిల్లాలోని గడ్కోల్, హాసాకొత్తూర్, కొండాపూర్, రామడుగు ప్రాజెక్టు, సిరికొండ గ్రామాల్లో 2004 సంవత్సరంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పోరాటాల ఫలితంగా నాటి మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి చేతుల మీగా పట్టాలు పొంది సుమారు 800ఎకరాల్లో సీఎల్‌డీపీలో భూ అభివృద్ధి చేసుకుని చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేయకపోవడం శోచనీయమన్నారు.