నిజామాబాద్

నెలాఖరులోగా సవరించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, జూన్ 21: రైతుబంధు పథకం కింద, రైతులకు అందజేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పొప్పులను ధరణి వెబ్‌సైట్‌లో సవరించి నమోదుచేసి, ఈ నెలాఖరులోగా లేదా జూలై మొదటి వారంలోరైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరుగుతోందని, కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక తహశీల్ కార్యాలయంలో కంప్యూటర్ గదిలో, ధరణి వెబ్ సైట్‌లోరైతుల పట్టాదారు పాసు పుస్తకాలోల దొర్లిన తప్పొప్పులను సవరించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేసిన వివరాలను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబందు పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు లక్ష 75 వేల నూతన పట్టెదార్ పాస్ పుస్తకాలను, చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 35వేల పట్టాదారు పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పొప్పులను, ధరణి వెబ్ సైట్ ద్వారా సరి చేయడం జరుగుతోందన్నారు. తప్పులను సవరించే కార్యక్రమం రెండు మూడురోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిలో 21వేల పాస్ పుస్తకాలు తప్పులు వచ్చాయన్నారు. 1450 తప్పులున్న వాటిని రైతుల నుంచి వాపస్ తీసుకోవడం జరిగిందన్నారు. వాటిని ధరణి వెబ్‌సైట్‌లో సరిచేసి రిప్రింట్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతోందన్నారు. 8,900 పాస్ పుస్తకాలకు ఆధార్ సీడింగ్ చేసి ఇస్తామన్నారు. 21వేల పాస్ పుస్తకాల్లో 2వేలు పౌతి కేసులున్నాయని, 2,600 క్రయవిక్రయాలకు సంబందించి ఉన్నాయని, పీఓటీ కేసులు 7,700 మందికి రెగ్యులైజేషన్ చేయడం జరగిందన్నారు. సాదాబైనామాలు 3,300 రెగ్యులైజేషన్ చేయడం జరిగిందన్నారు. ఫస్ట్ ఫేస్‌లో రిటన్ తీసుకున్న 10వేల 200 పాస్ పుస్తకాలను తహశీల్దార్‌లచే సవరించి రీప్రింట్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతోందన్నారు. పార్ట్ -బీలో ఉన్న వాటికి సర్వేయర్‌ల కొరత కారణంగా డిలే చేయడం జరుగుతోందన్నారు. పొలాల పంచాయతి, అటవీ భూములకు సంబంధించిన వాటిని సర్వేయర్‌ల ద్వారా సర్వే చేయించిన అనంతరం రైతులకు పాస్ పుస్తకాలను ఇవ్వడం జరుగుతుందన్నారు.
నెలాఖరు వరకు బీమా దరఖాస్తులు స్వీకరణ
రైతుబంధు పథకం కింద, రైతుజీవిత బీమా కోసం రైతుల నుంచి నామినీలతోకూడిన దరఖాస్తులను ఈనెలాఖరు వరకు స్వీకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఇట్టి దరఖాస్తులను జూలై 1 నుంచి 5 వరకు రైతుల వివరాలు సేకరించి, ప్రతి రైతుకు రైతుజీవిత బీమా కింద ఒక్కోరైతుకు ప్రభుత్వం 2,271రూపాయల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. వీటికి సంబంధించిన బాండ్‌లను ఆగస్టు 15వ తేదీన రైతులకు అందజేయడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు.
యోగాతో ఆరోగ్యం
ప్రతి ఒక్కరు యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని జిల్లాకలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ యోగాదినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా, గురువారం జరుపుకుంటున్నారని అన్నారు. యోగా 5,500 సంవత్సరాల పురాతనమైనదని, భారతీయు జీవన విధానం, సంస్కృతిలోయోగా ఒక భాగమని అన్నారు. ఎందరో మహనీయులు యోగాసాధనలో వినూత ప్రక్రియలు సాధించి సమాజ హితానికి కృషి చేశారన్నారు. యోగ సాధనలో ముఖ్యంగా మానవుడు, ఆత్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, క్రియా యోగం ఈ నాలుగింటిని ఆచరించిన వాడు పరిపూర్ణమైన మానవునిగా పరివర్తనం చెందుతాడని అన్నారు. ప్రతీ ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి కాని, నిర్దేశిత లక్ష్య సాధనలో సంతోషాన్ని మరిస్తే సాధించిన లక్ష్యం యొక్క ఆనందాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించలేమని అన్నారు. సంతోషంతోకూడుకున్న లక్షసాధన కోసం కృషి చేస్తేనే సాధించిన లక్ష్యంలో ఆనందం సంతృప్తి దొరుకుతాయని అన్నారు. వీటన్నింటిని సాధించడానికి మానసిక ప్రశాంతత అవసరమని, దీనికి యోగాయే ఏకైక మార్గమని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డీఓ వి.దేవేందర్‌రెడ్డి, తహశీల్దార్ సి.అంజయ్య, నాగిరెడ్డిపేట్ ఇన్‌చార్జి తహశీల్దార్ ఆర్డీఓ కార్యాలయం డీఏఓ సయిద్ అహ్మద్ మస్రూర్, డీటి అనిల్ కుమార్, డీటీ వరలక్ష్మి, సిబ్బంది తదితరులు ఉన్నారు. అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోనాగిరెడ్డిపేట్ మండలానికి సంబందించిన పాస్ పుస్తకాల తప్పుల సవరణ ధరణి వెబ్‌సైట్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.