నిజామాబాద్

ప్లాస్టిక్ నిర్మూలన సామాజిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూన్ 21: ప్లాస్టిక్ వినియోగం పెచ్చుమీరిపోయిన నేపథ్యంలో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందని, భూమిపై వాతావరణ కాలుష్యం పెరిగి అనేక ఇబ్బందులు, సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దీనిని సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో గురువారం టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకంతో భావితరాలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. పాలిథిన్ కవర్ల వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని, ఇవి భూమి పైన, భూమి లోపల కూడా కరిగిపోకుండా కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాయని పేర్కొన్నారు. మూగజీవాలు మృతి చెందినప్పుడు కారణాలు విశే్లషిస్తే ప్లాస్టిక్ కవర్లను తినడం వల్ల మృత్యువాతపడ్డ సంఘటనే అధికంగా వెలుగు చూస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. యాత్రికుల రద్దీ అధికంగా ఉండే శబరిమలైలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతో సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంలో భాగంగా తనవంతు బాధ్యతగా లక్ష బట్ట బ్యాగులు (క్లాత్ బ్యాగ్) సొంత ఖర్చుతో తయారు చేయించి పంపిణీ చేస్తానని ప్రకటించారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించేందుకు విరివిగా అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బట్ట బ్యాగులు, పేపర్ బ్యాగు ల కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని అన్నారు. కాగా, యూజీడీ, మిషన్ భగీరథ తదితర పనులను చేపడుతున్న క్రమంలో నగర ప్రజలకు కొంత ఇబ్బందులు తలెత్తిన విషయం వాస్తవమేనని ఎమ్మెల్యే అంగీకరించారు. సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు ఈ పనులను చేపడుతున్నామని, ఇప్పటికే 80శాతం వరకు రోడ్లను పునరుద్ధరించామని పేర్కొన్నారు. మరో పక్షం రోజుల్లో నగరంలోని అన్ని కూడళ్లు సుందరంగా తీర్చిదిద్దబడతాయని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు మెస్సేజ్‌లను ప్రజలు విశ్వసించవద్దని సూచించారు. విలేఖరుల సమావేశంలో నగర మేయర్ ఆకుల సుజాత, స్టాండింగ్ కమిటీ సభ్యులు దారం సాయిలు, గంగామణి, కార్పొరేటర్లు సిర్ప సువర్ణ, చాంగుబాయి, సాయిరాం, ఖుద్దూస్, టీఆర్‌ఎస్ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సూర్యప్రకాశ్, ప్రవీణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
కాగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా సూచించారు. గురువారం నగరంలోని 47వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ స్థాయి బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మరింత దగ్గరయ్యారని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలంటే నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.