నిజామాబాద్

యోగా దినోత్సవాన వెల్లివిరిసిన చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 21: సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు దోహదపడే యోగ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన యోగా కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ నగరం సహా ఎక్కడికక్కడ యోగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రధానంగా విద్యార్థినీ విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, అధికారులు, వైద్యులు ఎంతో ఉత్సాహంగా భాగస్వాములై యోగాసనాలపై తర్ఫీదు పొందారు. దాదాపుగా అన్ని విద్యా సంస్థల్లో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత నాలుగైదు రోజుల నుండే విస్తృత స్థాయిలో ప్రచారం చేసిన దరిమిలా, గురువారం నాటి కార్యక్రమానికి ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన లభించింది. యోగా గురువులు ఆసనాలు వేసే విధానాలపై శిక్షణ ఇస్తూ, యోగ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి తదితర అష్టాంగ యోగాసనాల గురించి క్లుప్తంగా తెలియజేస్తూ, వాటి వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించారు. ఉదయం 6.30 గంటల నుండి 7.30గంటల వరకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడంలో నిమగ్నమై కనిపించారు. జిల్లా కేంద్రంలో బస్వా గార్డెన్‌లో అధికార యంత్రాంగం తరఫున యోగా డే జరిపారు. ఎన్‌వైకే, ఆయూష్, జిల్లా యోగా అసోసియేషన్, రెడ్‌క్రాస్, యువజన సంక్షేమ శాఖ, ఇతర స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు జేసీ రాజారాం, ఆర్డీఓ వినోద్‌కుమార్, డిచ్‌పల్లి పోలీస్ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య, ఎన్‌వైకే కోఆర్డినేటర్ రాంచందర్‌రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ, బీ.ఆంజనేయులు తదితరులు పాల్గొని అందరితో కలిసి స్వయంగా యోగాసనాలు వేశారు. డాక్టర్లు, లాయర్లు, ప్రముఖ వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వహకులు, అన్ని వర్గాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చి యోగ ప్రాశస్తాన్ని చాటారు. జిల్లా కేంద్రంలోని హరిచరణ్‌మార్వాడి, కాకతీయ, నవ్యభారతి, ఎస్‌ఎస్‌ఆర్ తదితర విద్యా సంస్థలతో పాటు కంఠేశ్వర్‌లోని స్నేహ సొసైటీ పాఠశాలలో మానసిక వికలాంగ బాలలు కూడా ప్రపంచ యోగ దినోత్సవంలో పాల్గొన్నారు. బస్వాగార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో యోగ గురువు సిద్ధిరాములు వ్యాయామం, తాడాసనం, వృక్షాసనం, పాదహస్తాసనం, అర్ధచక్రాసనం, త్రికోనాసనం, భద్రాసనం, శశాంకాసనం, భుజంగాసనం, శలభాసనం, మకరాసనం, శవాసనం, సేతుబంధాసనం, ప్రాణాయామం, ధ్యానాసనం తదితర ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు మాట్లాడుతూ, యోగ వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగను తప్పనిసరిగా భాగం చేసుకోవాలని ఉద్బోధించారు. మన దేశ సంస్కృతిలో యోగ తరతరాలుగా ముడిపడి ఉందని, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను పూర్వకాలంలోనే ఋషులు, మునులు గుర్తించి ఆచరించారని అన్నారు. యోగ వల్ల కలిగే మేలును ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిందని, ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలితంగా ఇది సాధ్యమైందన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుతుందని, క్రమశిక్షణ అలవడుతుందని, సానుకూల దృక్పథంతో విజయాలు సాధించేందుకు దోహదపడుతుందని, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోగల్గుతారని అన్నారు. శారీరక, మానసిక వికారాలు దూరమై క్రమశిక్షణతో కూడిన జీవనం అవలంభించేందుకు కూడా యోగ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు అద్భుత యోగ విన్యాసాలు, నృత్య ప్రదర్శనలతో అలరించగా, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఆయా సంస్థల ప్రతినిధులను కలెక్టర్ సన్మానించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ రాంచందర్, రాజశేఖర్, చింతల గంగాదాస్, ప్రకాశ్‌గౌడ్, శ్రీనివాస్, రుక్మన్‌రావు, బైస హరిదాసు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు.