నిజామాబాద్

బాబోయ్ చిరుతపులి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, జూన్ 23: మండలంలోని హసన్‌పల్లిగ్రామ శివారులోచిరుతపులి సంచరిస్తూ, శుక్రవారం రాత్రి గొర్రెల మందపై దాడి చేసింది. హసన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మపోషయ్యకు సంబంధించిన గొర్రెను దాడి చేసి చంపివేసిందని బాధితుడు రోధిస్తు తెలపారు. రాత్రి సమయంలోఒకే సారి ఆకస్మత్తుగా గొర్రెల మందపై దాడి చేసి గొర్రెను చంపివేసిందన్నారు. దీంతోపదివేల రూపాయల ఆస్థినష్టం వాటిల్లిందన్నారు. హసన్‌పల్లిగ్రామశివారులోని మేకలు, గొర్రెల జీవాల దారులు తమ జీవాలను మేపేందు కోసం శివారు ప్రాంతంలోవెళ్లేందుకు జంకుతున్నారు. చిరుతపులి సంచరించడం వల్ల జీవాల దారులు భయాందొళనకు గురిఅవుతూ,ఏవైపు నుంచి జీవాలపై దాడిచేస్తుందోఅని భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఇప్పటికైన అటవీశాఖాధికారులు స్పందించి, జీవాలపై చిరుతపులి దాడి చేయకుండ చర్యలుతీసుకోవాలని కోరుతున్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
*అదనపు జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్
ఆర్మూర్, జూన్ 23: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్ అన్నారు. శనివారం ఆర్మూర్‌లోని వి జయ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ మోటార్ వెహికిల్ చట్టం, ర్యాగింగ్ చట్టం తదితర వా టిపై అవగాహన కల్పించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ఏదైన సమస్త తలెత్తితే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నా రు. ర్యాగింగ్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి గంగాధర్, ప్రధాన కార్యదర్శి గటడి ఆనంద్, కళాశాల డైరెక్టర్ వంశీ, పరిపాలన అధికారి రాము పాల్గొన్నారు.