నిజామాబాద్

లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 23: అనుకున్న లక్ష్యానికి ఆనుగుణంగా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆయన శనివారం కలెక్టరేట్‌లోని జనహితలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హరితహారాన్ని సామాజీక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, గ్యాస్, రైస్ మిల్లర్లు తమ పరిసరాల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు పర్యావరణ పరీరక్షణకు తోడ్పడుతాయని, కాలుష్యాన్ని నివారించి స్వచ్చమైన ఆక్సిజన్‌ను మానవళికి అందిస్తుందన్నారు. మొక్కలను నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు విలువైన సంపదను అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి సంవత్సరం అన్ని ప్రభుత్వ సంస్థలలో అమలు చేసిందని, రెండో సంవత్సరం విద్యార్థుల ద్వారా, 3వ సంవత్సరం విద్యార్థులు, కమ్యూనిటీ ద్వారా అమలు పర్చిందన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రాశి వనాన్ని, మాలుతుమ్మెదలో రాశీ వనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు హర్షిస్తున్నానన్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం నుంచి విలువైన మొక్కలను జిల్లాకు స్వచ్చందంగా తెప్పించి నాటించామన్నారు. జిల్లాలో 133 నర్సరీలు పని చేస్తున్నాయన్నారు. వాల్టా చట్టం 2005 ద్వారా 300 చదరపు గజాల ఇంటిలో తప్పకుండా ఐదు మొక్కలను నాటాలన్నారు. దీనిని ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా ప్రతీ రోజు వాటరింగ్‌ను నిర్ణీత సమయం కేటాయించాలన్నారు. మొక్కలు తప్పకుండా 33 శాతం ఉండే విధంగా ప్రతీ ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వర్షాపాతం ఎక్కువగా నమోదు అవుతుందన్నారు. రానున్న 4వ విడుత హరితహారానికి ప్రతీ గ్రామంలో గుంతలను త్రవ్వి సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఆనంతరం జాయింట్ కలెక్టర్ సత్తయ్య మాట్లాడుతూ, జిల్లాలో 18 బాయిల్డ్ రైస్ మిల్స్‌లో 3 వేల చొప్పున 5400 మొక్కలను నాటాలని, 98 రైస్ మిల్స్‌లలో 50 చొప్పున 4900 మొక్కలు, 62 పెంట్రోల్ బంక్‌లలో 100 చొప్పున 6200 మొక్కలను, ఎంఎల్‌ఎస్ పాయింట్‌లలో 200, ఎఎంసీ గోడౌన్లలో హమాలీల ద్వారా మొక్కలను తమ పరిసరాలల్లో నాటుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ రైస్ మిల్స్, గ్యాస్, పెట్రోల్ బంక్స్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని హరితహారంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. చెట్లు అధికంగా ఉండడం ద్వారా జుక్కల్‌లో 165 మీల్లిమీటర్ల వర్షం నమోదైందన్నారు. గాంధారి, బాన్సువాడ, మద్నూర్ మండలాల్లో హరితహారంలో చక్కటి వాతావరణాన్ని అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీ ఏపీడీ చంద్రమోహన్‌రెడ్డి, సీపీవో శ్రీనివాస్, డీఎం. సివిల్ సప్లయ్ అధికారి, రైస్ మిల్లర్స్, ఎల్‌పీజీ గ్యాస్ ఏజేన్సీలు, పెట్రోల్ బంక్స్ యాజమానులు, తదితరులు పాల్గొన్నారు.

30 వరకు రైతు జీవితబీమా దరఖాస్తులకు తుది గడువు
సదాశివనగర్, జూన్ 23: ఈ నెల 30 వరకు రైతు జీవిత బీమా నామినేషన్ ఫారాలను ఫారంలను తీసుకోవటం జరుగుతుందని ఏఈఓ మినుకుల రాకేష్ అన్నారు. శనివారం మండలంలోని దర్మారావుపేట్ గ్రామంలో రైతు బంధు జీవిత బీమా నామినేషన్ ఫారంలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 నుండి 59 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు రైతు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు ఏ కారణం చేతనైన రైతు చనిపోతే 5 లక్షల రూపాయల ఇన్స్‌రెన్స్ వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.