నిజామాబాద్

నా ఆస్తులు పంచడానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డిరూరల్, జూన్ 23: ఎమ్మెల్యేగా తాను సంపాదించుకున్న ఆస్తులను పంచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సమయంలో సంపాదించిన ఆస్తులన్ని కూడా ప్రజలకు పంచేందుకు సిద్ధంగా ఉన్నావా అంటూ ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ సవాల్ విసిరారు. శనివారం మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో గ్రామ పంచాయితీ భవనాన్ని విప్ ప్రారంభించారు. అనంతరము ఏర్పాటు చేసిన సభలో విప్ మాట్లాడుతూ, నేను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, తాను సంపాదించింది ఏమీ లేదని, తన సొంత నియోజక వర్గ కేంద్రంలో ఒక ఇల్లు ఉండాలని కొత్త ఇంటిని కట్టుకుంటే, ఆ ఇంటిని చూసి ఒర్వలేక షబ్బీర్‌అలీ, తాను ఏదో కోట్లు సంపాదించానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 1989నుండి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నుండి సంపాంచిన ఆస్తులను తాను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను మూడు పర్యాయాలు గెలిచి సంపాదించుకుంటది ఏమి లేదని ఒక ఇంటిని మాత్రం కట్టుకున్నానని అన్నారు. కాని షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ఎంత సంపాదించారో ప్రజలకు తెలుసని అన్నారు. నీ పేరుతో నీ సొదరులు సంపాదించింది ఎంతో ఉందనిఅన్నారు. తెలంగాణ రాష్రం సాధించిన తరువాత టీఆర్‌ఎస్ అధికారంలో వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ చేపడ్తున్న సంక్షేమ పథకాలను దేశ ప్రధాని సైతం మెచ్చుకుంటున్నారని అన్నారు. ఈరోజు దేశంలోని ఏ రాష్రంలో కూడా ఇంతటి మంచి ప్రజాసంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. పేద, మద్యతరగతి ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అన్న భరోసాను కల్పించి, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మ, టీఆర్‌ఎస్ నాయకులు పిప్పిరి ఆంజనేయులు, ఉపసర్పంచ్ రమేష్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.