నిజామాబాద్

వసతి గృహాల్లో హరితహారాన్ని విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూలై 13: కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వసతి గృహాలల్లో మొక్కలను నాటి విద్యార్థులచే ఒక్కొక్క మొక్కను నాటించాలని, ఆ మొక్కను పెంచే బాధ్యతలను విద్యార్థులకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లోని జనహిత సమావేశం హాల్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహ సంక్షేమాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డీఆర్‌డీ ఏ. పీడీ చంద్రమోహన్‌రెడ్డి, సీపీవో శ్రీనివాస్, బీసీడీవో దేవీదాస్, ఎస్‌డీవో అంజయ్య, డీటీడీవో శ్రీనివాస్, డీఎం డబ్ల్యూవో ప్రేమ్‌కుమార్, ఏబీసీడీ శంకరయ్య, డిప్యూటీ పారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయకుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులచే గ్రీన్ బి గ్రేడ్స్ కమిటీలను ఏర్పాటు చేయమన్నారు. వసతి గృహలలో వంద శాతం విజయవంతం చేయాలని కోరారు. వసతి గృహా సంక్షేమాధికారులను స్థానికంగా నివాసం ఉండాల్సిందిగా, వర్షాకాలం దృష్ట్యా వసతి గృహ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు త్రాగాటానికి కాచిన నీటిని అందించాలన్నారు. అలాగే వసతి గృహంలో పని చేసే సిబ్బంది పరిశుభ్రంగా ఉండేవిధంగా ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహ సంక్షేమాధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. వసతి గృహంలో ఈగలచే అంటు వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహాలల్లోని డైనింగ్ హాల్, కిచెన్‌లల్లో పరిశుభ్రంగా చేయుటకు న్యూవాన్‌లను వాడాల్సిందిగా వసతి గృహ సంక్షేమాధికారులకు ఆదేశించారు. వంట రూంలలో ప్రతీ 6 మాసాలకు సున్నాన్ని వేయాలన్నారు. ఎక్సాక్ట్ ఫ్యాన్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆధికారులనుకోరారు. మూత కల్గిన చెత్త బుట్టను వాడాలన్నారు. చిన్న చిన్న పగుళ్ళు కలిగిన బగోనాలను వాడకూడదన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు బోజనం అందించాలన్నారు. బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను 100 శాతం అమలు చేయాలని వసతి గృహ సంక్షేమాఖాధికారులను ఆదేశించారు.

వార్డెన్‌కు అవార్డును అందించిన మంత్రి
నిజాంసాగర్, జూలై 13: మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో గల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహవార్డెన్ కిషోర్‌కుమార్, అవార్డును దక్కించుకున్నారు. శుక్రవారం హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలోవార్డెన్ కిషోర్‌కుమార్‌కు, రాష్ట్ర ఎస్సీ సంక్షేమ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గత సంవత్సరం పదవ తరగతిల్వోంద శాతం ఉత్తీర్ణత శాతం సాధించినందుకు గాను వార్డెన్‌ను అభినందిస్తూ, శాలువా కప్పి పూలమాలలతోఘనంగా సత్కరించారు. కిషోర్‌ను అందరు ఆదర్శంగా తీసుకోవాలని వార్డెన్‌లకు సూచించారు.

16న ఏఐసీసీ కార్యదర్శి
శ్రీనివాస్ కృష్ణన్ రాక
కంఠేశ్వర్, జూలై 13: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా జిల్లాకు ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ ఈ నెల 16న నిజామాబాద్‌కు వస్తున్నారని, అందువల్ల పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ కోరారు. శుక్రవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకే ఏఐసీసీ కార్యదర్శి వస్తున్నారని అన్నారు. అందువల్ల పార్టీకి చెంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, పార్టీ ఉపాధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. సమావేశానికి బూత్ కమిటీలతో పాటు శక్తి కమిటీలను సైతం హాజరు కావాలన్నారు. టీ.పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్ మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టీ.పీసీసీ అధికార ప్రతినిధి గడుగు గంగాధర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నీతివంతమైన పాలనను అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, జిల్లాలో జరిగిన నకిలీ చలాన్ల కుంభకోణాన్ని ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎంపీ కవిత ప్రమేయం ఉన్నందువల్లే ఈ కేసును మూసివేశారా అని గడుగు ప్రశ్నించారు. వ్యాపారులు, రైస్‌మిల్లర్లు టీఆర్‌ఎస్ పెద్దలకు 20కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయని, అందుకే కేసును నీరుగార్చినట్లు అర్థమవుతోందన్నారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.