నిజామాబాద్

కోటి 32 లక్షల మొక్కలు నాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, జూలై 20: జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి, కోటి 32 లక్షల మొక్కలు పది రోజుల్లో నాటడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా ఎన్‌ఆర్‌ఈజీఎస్ వారిచే 5800ల మొక్కలు నాటి కార్యక్రమా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన కోటి 32 లక్షల మొక్కలల్లో ఇప్ప టి వరకు 19 లక్షల మొక్కలు నాటడం జరిగిందని, మరో పదిరోజులల్లో మిగ తా మొక్కలు నాటడం జరుగుతుందని, దీనిలో 90 లక్షల టేకు మొక్కలు రైతులకు సంబంధించిన భూములల్లో నాటడం జరుగుతుందని, ఆరు లక్షల ఈత మొక్కలు కూడా చెరువుగట్లపై నాటడం జరుగుతుందని, 20 వేల పండ్ల మొ క్కలు ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆరు మొక్కలు అందజేయడం జరుగుతుందని, వాటిని ఉపాధ్యాయుల సహకారంతో వారే పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. గడిచిన హరితహారం కార్యక్రమాలల్లో మొక్కలు నాటడం వల్ల గూగుల్ వ్యాప్‌లో చైనా, బ్రెజిల్ తరువాత తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం కనబడుతుందని తెలిపారు. ప్రతీ మండలం లో ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల స్థలంలో హరితవనం, రాశివనం, నక్ష త్ర వనం వంటివి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో నాటే మొక్కలను గ్రామం లో ఉండే వారే సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెట్లు నాటడం అంటే మనం లేకున్నా మన గుర్తు అని అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీ ఏపీడీ చంద్రమోహన్ రెడ్డి, కామారెడ్డి ఎంపీడీవో నాగేశ్వర్, క్యా సంపల్లి సర్పంచ్ భారతి, రాజ య్య, ప్రొహిబిషన్ ఎక్సై జ్ సీఐ ఫణీందర్ రెడ్డి, డీఆర్‌డీఏ సిబ్బంది, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
బదిలీపై వెళ్లిన టీచర్లకు ఘన సన్మానం
ఇందూర్, జూలై 20: ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రాథమిక పాఠశాలలో గడిచిన 9సంవత్సరాలుగా విధులు నిర్వర్తించి ఇటీవల జరిగిన బదిలీల్లో ఇతర పాఠశాలలకు బదిలీపై వెళ్లిన శకుంతల, మంక్యాలతో పాటు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు. శుక్రవారం జానకంపేట్ ప్రభుత్వ పాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్లిన, నూతనంగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు వీడ్కోలు, స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ ఎంపీపీ వరదగౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ కోడెల చిన్న లింగన్న ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు దశాబ్దకాలం పాటు తమ గ్రామంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఉపాధ్యాయుల సేవలను మరువలేనివన్నారు. ప్రతి ఉద్యోగికి బదిలీలు సహజమని, అయితే విద్యార్థుల, పాఠశాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేసినప్పుడే అటు విద్యార్థుల్లో, ఇటు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వరకుమారి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అచల, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ సరికెల సందీప్, వార్డు సభ్యుడు జబ్బార్, గ్రామ పెద్దలు గద్ద సాయిలు, ఎద్దండి నర్సయ్య, ఉపాధ్యాయులు గణేష్, సరస్వతి, విద్యార్థులు పాల్గొన్నారు.