నిజామాబాద్

రోడ్డు పనులు అడ్డగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, జూలై 20: మండల కేంద్రంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు మెయిన్ రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. రెండు జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్లతో పనులను చకచకా చేయిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన రోడ్డుకిరువైపులా గల వ్యాపారస్తులు, దుకాణదారులు శుక్రవారం నిరసన వ్యక్తం చేస్తూ రెండు గంటల పాటు దుకాణాలను మూసి ఉంచి బంద్ పాటించారు. తల్వేద ఎక్స్‌రోడ్డు సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు 25 కిలోమీటర్ రాయి నుంచి నందిపేట పట్టణంలోని జామా మజీదు వరకు 2.76 కిలోమీటర్ల పొడవున మెయిన్ రోడ్డును వెడల్పు చేయిస్తున్నట్లు ఆర్మూర్ ఆర్‌అండ్‌బీ ఏఇ కొండయ్య తెలిపారు. ఈ రోడ్డు వెడల్పు పనులతో పాటు రోడ్డు ప్రక్కల సీసీ డ్రైన్స్, ఎత్తు పెంచి బీడీ రోడ్డు నిర్మాణం చేపడ్తామని, ఈ పనులకు ప్రభుత్వం రెండుకోట్ల రూపాయలు మంజూరీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మండల కేంద్రమైన నందిపేట మెయిన్ రోడ్డును గత 20 సంవత్సరాల క్రితం పం చాయతీరాజ్ శాఖ వారు 20 ఫీట్ల బీటీ రోడ్డును నిర్మించారు. అప్పటి నుంచి నేటి వరకు అట్టి రోడ్డు ఎలాంటి మరమ్మతులకు నోచుకోక మట్టిరోడ్డుగా మారిపోయింది. గుంతలపడి రోడ్డు మొత్తం ధ్వంసమైంది. దుకాణదారులు డ్రైనేజీలు పూడ్చివేసి, వాటిపై మట్టిపోసి సామాగ్రి పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో వేసవికాలంలో దుమ్ము, దూళితో, వర్షాకాలం రోడ్డుపై నీరు నిలిచి రోడ్డు మొత్తం బురదమయమై రాకపోకలకు ప్రజలు, వా హనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. అంతేకాకుండా వ్యాపారస్థుల కబ్జాలతో రోడ్డు ఇరుకుగా మారి బస్సులు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. 30సంవత్సరాల కాలం నుంచి రోడ్డు కబ్జా గురించి, ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇటీవలే స్పందించి 100 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. నందిపేట మండల కేంద్రంలో జనాభా పెరగడం, పెద్ద వ్యాపార కేంద్రంగా ఏర్పడిన దృష్ట్యా అధికారులు రోడ్డు కబ్జాలను తొలగించి వెడల్పు పనులు చేపట్టడం హర్షించదగినదే. కానీ, మెయిన్ రోడ్డులో గత 40సంవత్సరాలుగా మడిగెలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్న దుకాణదారులు ఆందోళనకు గురవుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన నందిపేటలో 100్ఫట్ల రోడ్డు అవసరమా? అదే జరిగితే రోడ్డుకు ఇరుపక్కల ఉన్న ఇండ్లు, దుకాణాలు నేలమట్టమై వందలాది కుటుంబాలు వీధినపడే ప్రమాదం పొంచి ఉంది. పట్టణంలో అది కూడా మజీద్ వరకే 2.67 కిలోమీటర్ల 100 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు చేయడం సరికాదని ఇళ్ల యజమానులు, వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కల్పించుకుని న్యాయం చేయాలని, తమ బతుకులు రోడ్డున పడకుండా చూడాలని ఇళ్ల యజమానులు, దుకాణుదారులు కోరుతున్నారు.
నష్టం జరగకుండా చేయిస్తా
మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులను నిరసిస్తూ శుక్రవారం దుకాణదారులు, వ్యాపారస్థులు రెండు గంటల పాటు బంద్ పాటించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తన సోదరుడైన టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజేశ్వర్‌రెడ్డిని నందిపేటకు పంపించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు 100 ఫీట్లతో చేపడితే తమ బతుకులు రోడ్డున పడ్తాయని, వాహన రాకపోకలకు ఆర్మూర్, డొంకేశ్వర్ రెండు బైపాస్ రోడ్డులు ఉండగా, వ్యాపార కూడళి అయిన ప్రధాన రోడ్డును వెడల్పు చేయడం సరికాదని వ్యాపారస్థులు రాజేశ్వర్‌రెడ్డికి వివరించారు. వెడల్పు తగ్గించి తమకు నష్టం జరగకుండా పనులు చేపట్టాలని రాజేశ్వర్‌రెడ్డికి విన్నవించారు. రోడ్డు పనులతో ఎవరికి నష్టం జరగకుండా చేయించేందుకు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
28, 29 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ
* ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
కంఠేశ్వర్, జూలై 20: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జర్నలిస్టులకు ఈ నెల 28, 29 తేదీల్లో శిక్షణ నిర్వహిస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవా రం ఆయన నిజామాబాద్ పర్యటన కు హాజరైన సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వార్తల కవరేజీతో పాటు ముఖ్యమైన అంశాలపై నిపుణులతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. వార్తల సేకరణ, రాయడంలో మెళకువలు బోధించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు ఏడు జిల్లాలలో 4500 మంది జర్నలిస్టులకు శిక్షణ తరగతు లు ఇప్పించామని వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1000 మంది, వరంగల్‌లో 1200 మంది ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనూ అదే తరహాలో జర్నలిస్టుల నుంచి స్పం దన లభిస్తుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తపర్చారు. కాగా, జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సంక్షేమ నిధికి వంద కోట్ల రూపాయ ల నిధులు మంజూరు చేశారని, దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయలతో పాటు వారి కుటుంబానికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు పెన్షన్ చెల్లిస్తున్నారని, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 150 కుటుంబాలు సహాయం పొందాయని వివరించారు. అదేవిధంగా జర్నలిస్టులకు పెద్ద సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు సైతం అందిస్తున్నామని, ఉమ్మడి రా ష్ట్రంలో కేవలం 12 వేల కార్డులు ఇవ్వగా, తెలంగాణ ఏర్పాటైన తరువాత డెస్క్ జర్నలిస్టులకు, సబ్ ఎడిటర్లకు కూడా కలుపుకుని మొత్తం 16,897 కార్డులను జారీ చేశామ న్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టుల హెల్త్ స్కీం కింద ఎలాంటి పరిమితి లేకుండా ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు అందజేస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పటికే ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని, ఇళ్లు, ఇళ్ల స్థలాల హామీ విషయమై త్వరలోనే సముచిత నిర్ణయం తీసుకోనుందని, ఏ పద్ధతిన వీటిని మంజూరు చేయాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ పీఆర్‌ఓ రామ్మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.