నిజామాబాద్

మొక్కే ప్రగతికి తొలిమెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, జూలై 20: ప్రగతికి తొలి మెట్టుగా నిలిచే మొక్కలను ప్రతి ఒక్కరూ విరివిగా నాటుతూ, వాటిని సంరక్షించాలని తెలంగాణ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ సాంబయ్య సూచించారు. శుక్రవారం వర్సిటీ ఆవరణలో వీసీ ఆధ్వర్యం లో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టా రు. బోధన, బోధనేతర సిబ్బంది విశాలమైన వర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉపకులపతి సాంబయ్య మాట్లాడుతూ ప్రస్తుతం హరితహారం నాల్గవ విడతలో యూనివర్సిటీ పరిధిలో 71వేల మొక్కలు నాటాలని ల క్ష్యంగా నిర్దేశించారని, ఇందులో భాగం గా ఇప్పటికే 20 వేల మొక్కలు నాటడం పూర్తయ్యిందన్నారు. నిర్దేశిత గడువులోగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేలా కార్యాచరణను రూపొందించుకుని, అం దుకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని అన్నారు. గతేడాది కూడా 58 వేల మొక్కలను నాటడం జరిగిందని, అంతకుముందు 2016లో 51వేల మొక్కలు నాటామని వివరించారు. ఈసారి వేప, రావి, నీలగిరి, పెల్ట్ఫోమ్, గుల్‌ముహర్, నేరేడు, ఉసిరి, బత్తాయి, పనస, చైనాబాద్, రైన్‌ట్రీ, టీక్, సీతాఫల్, బీజాసాల్, రోజ్‌వుడ్, పసరిగినె్న, మారే డు, నెమలినార, తదితర రకాలకు చెం దిన మొక్కలను నాటుతున్నామని వివరించారు. వీటిని డ్వామా, అటవీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నర్సరీల నుండి తమకు అందజేస్తున్నారని తెలిపారు. మొక్కలలో కొన్ని అటవీ ప్రాంతానికి చెందినవని, మరికొన్ని పెరటి మొక్కల జాతికి చెందినవని వివరించారు. వర్శిటీ ప్రాంగణంలో నాటుతున్న వాటిలో రకరకాల పండ్ల మొక్కలతో పాటు మరికొన్ని ఔషధ మొక్కలు కూడా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ శిరీష బోయపాటి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణబాయి, సీఈఓ డాక్టర్ నాగరాజ్, చీఫ్ వార్డెన్ డాక్ట ర్ సాయిలు, పీఆర్‌ఓ డాక్టర్ వీ.త్రివేణి, ఎస్టేట్ ఆఫీసర్‌లు అశోక్‌వర్దన్, యాదగిరి, ఏఈ వినోద్‌కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
వాటర్ ప్లాంట్ ఏర్పాటు
విశ్వవిద్యాలయంలోని బాలుర వసతి గృహంలో విద్యార్థులకు శుద్ధి జలాలు అందించేందుకు వీలుగా నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను శుక్రవారం వీ.సీ సాంబయ్య లాంఛనంగా ప్రారంభించారు. దీని ద్వారా వచ్చే నీటిని వీసీ స్వయంగా తాగి పరీక్షించారు. ఈ వాటర్ ప్లాంట్ 500 ఎల్‌ఫీహెచ్ సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో తాగునీటి కలుషితం వల్ల అనేక వ్యాధు లు సోకే ప్రమాదం ఉన్నందున విద్యార్థు ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించామన్నారు. హాస్టల్‌లో ఉండే దాదాపు 250 మంది వి ద్యార్థుల తాగునీటి అవసరాలకు ఈ వాట ర్ ప్లాంట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్టల్ చీఫ్ వార్డె న్ డాక్టర్ సాయిలు, వార్డెన్ అబ్దుల్ ఖవి, సూపరింటెండెంట్ శ్రీమతి విజయలక్ష్మి, ఏఈ వినోద్‌కమార్, పీఆర్‌ఓ డాక్టర్ వీ. త్రివేణి, కేర్‌టేకర్‌లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వామ్మో. వానరమూక
నిజాంసాగర్, జూలై 20: గ్రామాల్లో రోజురోజుకు వానర సేనల దాడులు అధికం కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే నిజాం సాగర్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వీటి బెడద అధికంగా ఉంది. అనునిత్యం ఉదయ నుంచి రాత్రి వరకు ప్రజల పనులకు ఆటంకం కలిగిస్తూ, దాడు లు చేస్తున్నాయి. అంతేకాకుండా చిన్నారులు తమ చేతుల్లో ఏవైనా వస్తువులు పట్టుకుని వెళ్లేందుకు జంకుతున్నారు. కిరాణా దుకాణాల వారు తమ వస్తువులను ఆకస్మాత్తుగా దాడిచేసి ఎత్తుకెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనదారులపై వానరాలు దాడులకు సిద్ధమవుతున్నాయి. దీంతో ద్విచక్రవాహనదారులు వానరమూకను చూసి అవివెళ్లేంత వర కు వేచిచూడాల్సి వస్తుంది. గ్రామల్లో వానరాల దాడితో పెంకుటిళ్లులు ధ్వంసం అవుతున్నాయి. వర్షాకాలం కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటి యజమానులు తమఇంటిపై కప్పులకు ఇంగ్లీష్ కూనలతోకప్పించి, పూర్తి స్తాయిలో మరమ్తత్తులు చేయించుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అటవీ శాఖాధికారులు, వీటి బెడదనుంచి విముక్తి కలిగించాలని పత్రికా ముఖంగా జనం కోరుతున్నారు.