నిజామాబాద్

మట్టి పనుల్లో బయటపడ్డ వెండి ఆభరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, జూలై 20: ఆలయ పరిసరాల్లో మట్టి పనులు చేపడుతుండగా రాగి చెంబులో వెండి ఆభరణాలు లభించాయి. మండల కేంద్రంలోని మొకరంపేట హనుమాన్ మందిరం ఆవరణ అంతా చెట్లమయంగా మారడంతో వాటిని తొలగించి, గుంతలను పూడ్చే పనిని గాంధారి సర్పంచ్ సత్యం చేపట్టారు. జేసీబీ సహాయంతో శుక్రవారం ఆలయం పరిసరాల్లో ఉన్న గుంతలను పూడ్చేందుకు గాను ఆలయం వెనక భాగం నుండి మట్టిని తీసి ట్రాక్టర్ సహాయంతో ఆలయం వద్ద పోస్తున్నారు. కాగా దానిని పరిశీలించేందుకు వేదపండితులు జోషి భరత్ భూషన్, విడిసి సభ్యులు రావుసాహెబ్‌రావు, గ్రామపెద్దలు సాయాగౌడ్, సాహెబ్‌రావు, భాస్కర్ గౌడ్ తదితరులు మట్టిని పోసే కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మట్టిని దూరం నుండి తీసుకువచ్చి ఆలయం వెనకభాగంలో పోయగా అందులో నుండి రాగి చెంబు బయటపడింది. అక్కడే ఉన్న సాహెబ్‌రావు దానిని పరిశీలించగా అది రాగిచెంబుగా ఉందని భావించి దానిని అందరి సమక్షంలో పగలగొట్టారు. దాంట్లో నుంచి వెండి వస్తువులు కనిపించాయి. వెం టనే ఈ విషయాన్ని సర్పంచ్ సత్యం ఎస్‌ఐ సత్యనారాయణ, తహశీల్థార్ లక్ష్మణ్, ఆర్‌ఐ శ్రీనివాస్ రావుకు సమాచారం అందించారు. లభ్యమైన వెండి వస్తువులను పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అందులో చిన్నచిన్న చేతి ఉంగరాలు, చేతులకు ధరించే ఆభరణాలు లభించాయి. అనంతరం వాటిని తహశీల్థార్ కార్యాలయానికి తీసుకువెల్లారు. లభించిన వెండి వస్తువులు పురాతన కాలం నాటివని, వాటిని భూమిలో దాచగా బయటపడినట్లు ఆర్‌ఐ శ్రీనివాస్ రావు తెలిపారు. వెండి ఆభరణాల విలువ దాదాపుగా 12 వేల రూపాయల వర కు ఉంటుందన్నారు. కాగా ఈ విషయం గాంధారి మండల కేంద్రంలో దావాణంలా వ్యాపించడంతో ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకుంటున్నారు.