నిజామాబాద్

ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, జూలై 20: ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయమని నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ అన్నారు. శుక్రవారం వనె్నల్(బి) గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ బాల్కొండ మండలంలో గ్రామస్థుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న గ్రామం వనె్నల్ (బి)అని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని అన్ని గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఒక్క సీసీ కెమెరా 100 పోలీసు సిబ్బందితో సమానమని, అలాంది గ్రామంలో 14సీసీ కెమెరాలను 2.90 లక్షలతో వీడీసీ ఏర్పాటు చేయ డం అభినందనీయమన్నారు. దీంతో గ్రామంలోనే కాకుండా మండల, డివిజన్, జిల్లాస్థాయి లో సైతం సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్తాయన్నారు. ఇందుకు ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని నేరాలను ఈ సందర్భంగా సీపీ వెల్లడించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో జరిగిన ఓ చోరీ ఘనటలో నిందితులను మూడు గంటల్లోనే పట్టుకోవడం సీసీ కెమెరాల ద్వారనే సాధ్యమైందన్నారు. అలాగే ప్రజలు డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని, మూఢనమ్మకాలకు తావివ్వకుండా గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నిర్మించాలన్నారు. అలాగే సోషల్ మీడియా అయిన వాట్సప్, ఫేస్‌బుక్‌లలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, అలాంటి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మెసులుకుంటూ, వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భూషణ్, ఎంపీటీసీ రాజేశ్వర్, ఆర్మూర్ ఏసీపీ శివకుమార్, రూరల్ సీఐ రమణారెడ్డి, బాల్కొండ ఎస్‌ఐ స్వామిగౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.