నిజామాబాద్

మధ్యాహ్న భోజనానికి 25 శాతం లోపే విద్యార్థుల హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, ఏప్రిల్ 29: కరవు నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం సర్కారు బడుల్లో ప్రస్తుత వేసవి సెలవుల్లోనూ అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి పాతిక శాతం లోపే విద్యార్థులు హాజరవుతున్నారు. నందిపేట మండలంలో మొత్తం 56 పాఠశాలల్లో 4934మంది విద్యార్థులు ఏప్రిల్ నెల రికార్డుల ప్రకారం ఉండగా, శుక్రవారం 1145మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనం చేశారని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. మండలంలో 3యుపిఎస్, 36 పిఎస్, 17ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 4934మంది పాఠశాలలకు సెలవులు ప్రకటించే చివరి రోజు రికార్డు ప్రకారం విద్యార్థులు ఉన్నారు. మండలంలోని చింరాజ్‌పల్లి పాఠశాలలో 30మంది విద్యార్థులకు ఐదుగురు, కంటం పాఠశాలలో 53మందికి 11మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వెళ్లి భోజనాలు చేశారు. భోజన పథకం పకడ్బందీగా అమలు చేయడానికి ఎంఇఓతో పాటు కాంప్లెక్స్ సిఆర్‌పిలు పాఠశాలలను ఉదయానే్న పర్యవేక్షించి విద్యార్థులు ఎంత మంది హాజరయ్యారు, 10గంటల్లోపు మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా వివరాలు తెలియజేస్తున్నారు. కానీ విద్యార్థుల హాజరు శాతం అతి తక్కువగా 25శాతం వరకే ఉంటుండడంతో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏమి చేయాలో తోచడం లేదంటున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో చాలామంది పిల్లలు వారి బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్తున్నారు. అదేవిధంగా వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు కూడా తమతమ ఇళ్లకు వెళ్లడంతో మధ్యాహ్న భోజనానికి విద్యార్థుల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఉదయం 8.30 నుండే పాఠశాలల్లో అరకొరగా మధ్యాహ్న భోజనం వండించి, 10.30లోపే వచ్చిన నలుగురైదుగురు పిల్లలకు వడ్డించి ఇళ్లకు పంపించేస్తున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా మండుతుండడం వల్ల కూడా విద్యార్థులను వారి తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనం కోసం బడులకు పంపేందుకు జంకుతున్నారని తెలుస్తోంది.