నిజామాబాద్

ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, ఆగస్టు 13: ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని, రాబోయే రోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సాయినాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆయనను అధిష్టానం రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా ఎంపిక చేస్తూ నియామక పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ, కో ఆర్డినేటర్‌గా తనను ఎంపిక చేసేందుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాంల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని చెప్పారు. ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజా సంక్షేమం కోసం రాహుల్ గాంధీ పాటుపడుతారని చెప్పారు. రాష్ట్రంలో టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో పార్టీ విజయ దుంధుభి మోగించడం ఖాయమన్నారు. పార్టీని ప్రజలు ఆదరించి గెలిపిస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, నిరుపేద కుటుంబాల్లో వెలుగును నింపేందుకు గాను ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేయనున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, టీఆర్‌ఎస్ పార్టీ అలవికాని హామీలతో అధికారంలో వచ్చి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్న సత్యాన్ని గుర్తించి, తిరిగి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని చెప్పారు. పార్టీని పటిష్టం చేసేందుకు గాను ప్రతి కార్యకర్త సైనికుడిలా బాధ్యతలను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నం కాబోతుందన్నారు. పార్టీ బలోపేతానికి పాటుపడే కార్యకర్తలకు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని, అధిష్టానం వారి సేవలను ఎప్పటికీ గుర్తిస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ యువతను ప్రోత్సాహిస్తూ వారికి అండగా నిలిచి పార్టీ నియమాలు, పటిష్టత కోసం కృషి చేస్తున్నారని సూచించారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

స్వల్పంగా పెరిగిన శ్రీరాంసాగర్ నీటిమట్టం
బాల్కొండ, ఆగస్టు 13: శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన ఆదిలాబాద్, నాందేడ్, నిజామాబాద్ జిల్లాలతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా 3240క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం సాయంత్రానికి రిజర్వాయర్‌లో నీటిమట్టం 1062.60 అడుగులు, 16.76 టీఎంసీలకు చేరుకుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 90 టీఎంసీలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1055.00 అడుగులు, 9.28టీఎంసీల వద్ద నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జూన్ మొదటి వారం నుండి నేటి వరకు రిజర్వాయర్‌లోకి 10.35 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని వారు వివరించారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
మద్నూర్, ఆగస్టు 13: మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం వ్యవసాయ అధికారి రాజలింగం ఎరువుల షాపులను తనిఖీ చేశారు. షాపులో ఉన్న ఎరువుల విత్తనాల బస్తాలను పరిశీలించి రికార్డులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో విత్తనాలను ఎరువులను ఉంచడం జరిగిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలకు చీడ పీడలు సోకకుండా వారిని సకాలంలో అప్రమత్తం చేస్తూ చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను వివరించడం జరుగుతోందన్నారు. రైతులకు అందుబాటులో వ్యవసాయ విస్తీర్ణ అధికారులను ఉంచడం జరుగుతుందని, వారితో పాటు రైతు సమన్వయ సమితి సభ్యులతో కలిసి పంటలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి, ఏవైనా సమస్యలుంటే వాటి నివారణకు రైతులకు సూచనలు చేస్తున్నామని చెప్పారు.