నిజామాబాద్

కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు గడిచినా, భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులను పాలకులు కాలరాస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. కేంద్రంలోని ఎన్డీయే అధికారంలోకి రాకముందు అవినీతి, ధరలు, సంపద గురించి మాట్లాడిన మోడీ, అధికారంలోకి వచ్చాక రెండు కోట్ల ఉద్యోగాల కల్పన గురించి విస్మరించి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను నానాటికీ పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. కులాల వారీగా, మతాల వారీగా ప్రజలను విభజిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, గల్ఫ్ బాధితులకు ప్రత్యేక నిధి, రేషన్ కార్డుల మంజూరు వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, జిల్లా సమస్యపై కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌సీఎస్‌ఎఫ్ కర్మాగారాలను తెరిపించకపోవడం శోచనీయమన్నారు. నవీపేట మండలం అబ్బాపూర్‌లో దళితుల భూమిని 2013లో ఎర్రకుంట ప్రాజెక్టు కోసం బలవంతంగా లాక్కున్నారని అన్నారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు విధానాలను అవలంభిస్తే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ ధర్నాలో సీపీఐ నాయకులు సుధాకర్, రాజన్న, స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.

మరో 20 ఏళ్లు కేసీఆర్ పాలనే..
*ఎమ్మెల్సీ వీజీ.గౌడ్
డిచ్‌పల్లి రూరల్, ఆగస్టు 13: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఇరవై సంవత్సరాల వరకు కేసీఆర్ పాలనే కొనసాగనుందని, వచ్చే అన్ని ఎన్నికల్లోనూ తెరాస అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ వీ.గంగాధర్‌గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం రైతులకు జీవిత బీమా బాండ్‌లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ వీజీ.గౌడ్ మాట్లాడుతూ, అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలు వెన్నంటి ఉంటారనే సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజలు తెరాస పార్టీనే ఆదరిస్తారని అన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా రైతులకు బీమా పథకం కింద 1200కోట్ల రూపాయలను కేటాయించి, 28లక్షల మంది రైతాంగానికి లబ్ధి చేకూరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతుల మేలు కోసం అహరహం శ్రమిస్తూ సాగు రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందన్నారు. రైతులకు ముందస్తు పెట్టుబడులు అందిస్తూ, 24గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం, గిడ్డంగుల సామర్థ్యం పెంపు వంటి కార్యక్రమాలను చేపడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అరవై ఏళ్లు అధికారంలో కొనసాగిన ఏ రాజకీయ పార్టీ కూడా ఈ తరహాలో రైతుల గురించి ఆలోచనలు చేయలేదన్నారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కేసీఆర్ పాలనలో రాష్ట్రం శరవేగంగా పురోగతి వైపు అడుగులు ముందుకేస్తోందని, అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతోందన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రజలు మరోమారు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, ఎంపీడీఓ సురేందర్, మండల తెరాస అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణతో పాటు రైతులు పాల్గొన్నారు.