నిజామాబాద్

సైనిక సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 13: తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం సైనిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని హైదరాబాద్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటీ 75లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సైనిక్ భవన్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీనేష్‌కుమార్ మాట్లాడుతూ, గడిచిన అరవై ఏళ్ల కాలంలో కేవలం రెండు జిల్లాలలో మాత్రమే సైనిక్ భవనాలను ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్ల కాలంలోనే నాలుగు జిల్లాలలో సైనిక్ భవన్‌లను నిర్మించుకునేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసిందన్నారు. నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలలో కోటీ 75లక్షల రూపాయల చొప్పున నిధులను వెచ్చిస్తూ సైనిక్ భవన్‌లను నిర్మిస్తున్నామని అన్నారు. వీటిలో నిజామాబాద్‌లోని భవన నిర్మాణం పనులు పూర్తయ్యాయని, అన్ని ఆధునిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సైనిక్ భవన్‌ను ఈ నెల 17వ తేదీన రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. ఈ భవనంలో క్యాంటీన్ సదుపాయంతో పాటు నాలుగు ఏసీ రూమ్‌లు, మరో నాలుగు నాన్ ఏసీ గదులు ఉన్నాయన్నారు. సైనిక్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ సైనికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని కోరారు. విలేఖరుల సమావేశంలో డైరెక్టరేట్ సైనిక్ ప్లేస్‌మెంట్ అధికారి ఆర్.శ్రీనివాసులు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి బీ.రామ్మోహన్ పాల్గొన్నారు.