నిజామాబాద్

విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 14: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సాంబయ్య సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో భారత ఫుట్‌బాల్ (అండర్-17) జట్టుకు కెప్టెన్‌గా ఎన్నికైన గుగులోత్ సౌమ్యకు కేర్ ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వీ.సీ సాంబయ్య మాట్లాడుతూ, సౌమ్య భారత ఫుట్‌బాల్ జట్టుకు నాయకత్వం వహించేలా ఆమెను తీర్చిదిద్దేందుకు కృషి చేసిన కేర్ డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. గూగులోత్ సౌమ్య భవిష్యత్తులో అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా వరుస విజయాలతో తన సత్తాను చాటాలని అభిలషించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎగ్స్ తింటుంటే, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కొందరు డ్రగ్స్ తింటున్నారని వీ.సీ సాంబయ్య పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి, చివరి పేజీలు వారివి కావని, మధ్యలో ఉన్న పేజీలే వారివని అన్నారు. దమ్ము లేని విద్యార్థి కరెంటు లేని ట్రాన్స్‌ఫార్మర్ వంటివాడని అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు పునాది యవ్వన దశ అని, ఇప్పటి నుండి కష్టపడితేనే జీవితంలో సుఖ పడతారని అన్నారు. ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ముఖ్య సాధనం చదువే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేర్ డిగ్రీ కళాశాల చైర్మెన్ నరాల సుధాకర్, ఫుట్‌బాల్ అకాడమీ కోచ్ నాగరాజ్, ఎన్‌సీసీ లెఫ్టినెంట్ రాజేంద్రప్రసాద్, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.